AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మోగిన నగారా.. సూర్యపేట జిల్లాలో అమలులోకి ఎన్నికల కోడ్

మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ రెండు రాష్ట్రాలతో పాటుగా పలు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న అసెంబ్లీ స్థానాలకు కూడా ఈసీ ఉప ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో మొత్తం 64 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నట్లు సీఈసీ సునీల్ అరోరా తెలిపారు. ఈ ఉప ఎన్నికల్లో తెలంగాణలోని హుజూర్‌నగర్‌ కూడా ఉంది. సుర్యపేట జిల్లాలోని ఖాళీయైన ఈ స్థానానికి అక్టోబర్‌ 21వ […]

మోగిన నగారా.. సూర్యపేట జిల్లాలో అమలులోకి ఎన్నికల కోడ్
TV9 Telugu Digital Desk
|

Updated on: Sep 21, 2019 | 11:24 PM

Share

మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ రెండు రాష్ట్రాలతో పాటుగా పలు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న అసెంబ్లీ స్థానాలకు కూడా ఈసీ ఉప ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో మొత్తం 64 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నట్లు సీఈసీ సునీల్ అరోరా తెలిపారు. ఈ ఉప ఎన్నికల్లో తెలంగాణలోని హుజూర్‌నగర్‌ కూడా ఉంది. సుర్యపేట జిల్లాలోని ఖాళీయైన ఈ స్థానానికి అక్టోబర్‌ 21వ తేదీన ఉప ఎన్నిక జరగనుంది. అయితే హుజూర్‌నగర్‌ ఉపఎన్నికకు షెడ్యూల్‌ విడుదలైన నేపథ్యంలో సూర్యాపేట జిల్లాలో ఇవాళ్టి నుంచి ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌ కుమార్‌ తెలిపారు. 2019 జనవరి 1 నాటి ఓటర్ల జాబితా ప్రకారమే ఈ ఉపఎన్నిక నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాకు సంబంధించి ప్రభుత్వం ఏ విధానపరమైన ప్రకటనలు చేయరాదన్నారు. అంతేకాదు జిల్లాలో మంత్రులు ఎవ్వరూ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనరాదన్నారు. అదేవిధంగా జిల్లాకి సంబంధించిన ఏ ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు కూడా చేపట్టరాదన్నారు. డబ్బు, మద్యం సరఫరాపై ప్రత్యేక నిఘా పెడుతున్నట్లు రజత్ కుమార్ తెలిపారు. ఎవరైనా ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించినట్లు అనిపిస్తే.. సి-విజిల్‌ యాప్‌ ద్వారా ఫిర్యాదులు చేయవచ్చని పేర్కొన్నారు.

Follow Us
ఆన్‌లైన్ గేమ్ ఆడొద్దని మందలించినందుకు దారుణం.. హత్యకు గురైన మామ
ఆన్‌లైన్ గేమ్ ఆడొద్దని మందలించినందుకు దారుణం.. హత్యకు గురైన మామ
MBBS విద్యార్థి ఆత్మహత్య? హైదరాబాద్ రామంతాపూర్‌లో విషాదం
MBBS విద్యార్థి ఆత్మహత్య? హైదరాబాద్ రామంతాపూర్‌లో విషాదం
గుడిలో గంట కొట్టడం వెనుక అసలు రహస్యం ఇదే! ఆధ్యాత్మికత వెనుక ఉన్న
గుడిలో గంట కొట్టడం వెనుక అసలు రహస్యం ఇదే! ఆధ్యాత్మికత వెనుక ఉన్న
ఈ షాకింగ్‌ ఘటన చూస్తే వణుకుపుట్టాల్సిందే..!
ఈ షాకింగ్‌ ఘటన చూస్తే వణుకుపుట్టాల్సిందే..!
ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికుడి బ్యాగులో గన్.. అంతలోనే కాల్పులతో..
ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికుడి బ్యాగులో గన్.. అంతలోనే కాల్పులతో..
గంటకు 320 కి.మీ. వేగంతో నీటి అడుగున భారత్ తొలి బుల్లెట్ రైలు..
గంటకు 320 కి.మీ. వేగంతో నీటి అడుగున భారత్ తొలి బుల్లెట్ రైలు..
ఆస్తి ఆశతో దారుణ హత్యలు.. సీసీకెమెరాలో కిల్లర్ తల్లి, కొడుకు !
ఆస్తి ఆశతో దారుణ హత్యలు.. సీసీకెమెరాలో కిల్లర్ తల్లి, కొడుకు !
వందే భారత్ ఢీ కొని యువతి మృతి! మౌలాలి వద్ద విషాద ఘటన
వందే భారత్ ఢీ కొని యువతి మృతి! మౌలాలి వద్ద విషాద ఘటన
బెడ్‌షీట్ల నుంచి చెమట, ముక్క వాసన వస్తోందా..? ఇలా క్లీన్ చేస్తే
బెడ్‌షీట్ల నుంచి చెమట, ముక్క వాసన వస్తోందా..? ఇలా క్లీన్ చేస్తే
ఇరుముడి 'మల్లెపూల పల్లకి' సాంగ్ వచ్చేసింది.. లిరికల్ వీడియో
ఇరుముడి 'మల్లెపూల పల్లకి' సాంగ్ వచ్చేసింది.. లిరికల్ వీడియో