
పంటలు ఎండేకాలం – గుండెలు మండేకాలం. నీటి కొరతలు-ఎడాపెడా కరెంటు కోతలు.. తెలంగాణ డ్రాట్ కామ్. అవును.. రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది.. కరువు కోరల్లో చిక్కుకుంది. ప్రభుత్వం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా గ్రౌండ్లెవల్లో తిప్పలు చూస్తే ఇదే నిజమనిపిస్తోంది. దాదాపు ఏడాదిన్నరపాటు గడ్డుకాలమే అని స్వయానా క్యాబినెట్ మంత్రులే గొంతు చించుకుంటున్నారు. యుద్ధప్రాతిపదికన అప్రమత్తమైంది ప్రభుత్వం. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో ముందడుగు పడింది. భారీ పంప్ మోటార్లు స్విచ్ ఆన్ చేసి తాగునీటి అవసరాల కోసం నార్లపూర్ రిజర్వాయర్లోకి ఆరు టీఎంసీల నీటిని విడుదల చేశారు మంత్రి జూపల్లి కృష్ణారావు. సోమవారం (అక్టోబర్ 12) నాగర్ కర్నూల్ జిల్లాలో అదొక పండగ వాతావరణం. బిరబిరా క్రిష్ణమ్మ పరుగులిడినట్టే అని జనం సంబరపడిపోయారు. కానీ, ఆ సెలబ్రేషన్ టైమ్స్ ఆ కాసేపే. తెల్లారేసరికి డామిట్ కథ అడ్డం తిరిగింది. విద్యుత్ సమస్యతో కొన్ని గంటల గ్యాప్లోనే మోటార్లు ఆగిపోయాయి. ఒక్కరోజులోనే ఉప్పొంగిన క్రిష్ణమ్మ.. చప్పున కిందకి ఇంకిపోయింది. కరెంట్ సమస్య తీరి, మోటార్లను మళ్లీ ఆన్ చేసినా నో యూజ్. భారీ స్థాయిలో నిరంతర సరఫరా ఉంటేనే నీటిని ఎత్తిపోసేంతటి శక్తి మోటార్లకు వచ్చేది. కానీ, గ్రిడ్ నుంచి ఆ రేంజ్లో విద్యుత్ సప్లయ్ లేదు. ఫలితం.....