TG Teachers Posting : విద్యాశాఖ కీలక ప్రకటన.. డీఎస్సీ పోస్టింగ్ కౌన్సెలింగ్ వాయిదా.. కొత్త తేదీలు ఎప్పుడంటే..!

అక్టోబర్ 9న ఎల్బీ స్టేడియం వేదికగా ఎంపికైన 10,006 మందికి నియామకపత్రాలను అందజేశారు సీఎం రేవంత్‌రెడ్డి. వారికి విద్యాశాఖ అధికారులు మంగళవారం పోస్టింగ్‌లు ఇవ్వాలని నిర్ణయించింది. కానీ.

TG Teachers Posting : విద్యాశాఖ కీలక ప్రకటన.. డీఎస్సీ పోస్టింగ్ కౌన్సెలింగ్ వాయిదా.. కొత్త తేదీలు ఎప్పుడంటే..!
DSC 2024 final key
Follow us

|

Updated on: Oct 15, 2024 | 12:11 PM

తెలంగాణలో డీఎస్సీ పోస్టింగ్‌ కౌన్సెలింగ్ వాయిదా పడింది. 2024 డీఎస్సీ ద్వారా ఎంపికైన ఉపాధ్యాయలకు పోస్టింగ్‌ కౌన్సెలింగ్ వాయిదా వేస్తున్నట్టుగా ప్రకట వెలువడింది. అనివార్య కారణాల వల్ల కౌన్సెలింగ్ వాయిదా వేసినట్లు అధికారులు ప్రకటించారు. ఇక కౌన్సెలింగ్ తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని విద్యాశాఖ అధికారులు వివరించారు. ఇవాళ్టి (అక్టోబర్‌15) కౌన్సిలంగ్ నేపథ్యంలో అభ్యర్థులంతా ఇప్పటికే కలెక్టర్లకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా కౌన్సెలింగ్‌ వాయిదాపడటంతో.. కొత్త టీచర్లు నిరాశతో వెనక్కి వెళ్తున్నారు. కౌన్సిలింగ్‌ వాయిదా పడినట్లు తమకు కూడా సమాచారం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అభ్యర్థులు.

అక్టోబర్ 9న ఎల్బీ స్టేడియం వేదికగా ఎంపికైన 10,006 మందికి నియామకపత్రాలను అందజేశారు సీఎం రేవంత్‌రెడ్డి. వారికి విద్యాశాఖ అధికారులు మంగళవారం పోస్టింగ్‌లు ఇవ్వాలని నిర్ణయించింది. కానీ..జిల్లాల నుంచి ఖాళీల వివరాలు సరిగ్గా లేకపోవడం, జీవో 317 బాధితుల ఇష్యూ తేలాల్సి ఉండటంతో వాయిదా వేసినట్లుగా తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..