Watch: తన పెళ్లికి వచ్చిన అతిథికి ప్రాణం పోసిన వధువు..! ఏం జరిగిందో చూస్తే..
కొల్హాపూర్ జిల్లా బండివాడేలో జరిగిన పెళ్లిలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఓ అతిథి కుప్పకూలిపోగా, డాక్టర్ అయిన వధువు వెంటనే స్పందించి చికిత్స అందించింది. ఆమె సకాలంలో చేసిన వైద్య సాయం వల్ల అతిథి ప్రాణాపాయం నుంచి బయటపడింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, వధువు ధైర్యసాహసాలను నెటిజన్లు ఎంతగానో ప్రశంసించారు. ఆమె నిజమైన హీరోయిన్ అని కొని
ప్రస్తుత కాలంలో గుండెపోటు వార్తలు దడ పుట్టిస్తున్నాయి. వయసుతో సంబంధం లేకుండా పిల్లలు, పెద్దలు చాలా మంది గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా హార్ట్ ఎటాక్ కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. సరైన సమయంలో వైద్య సహాయం అందక ప్రాణాలు కోల్పోయిన వారు కూడా చాలా మంది ఉన్నారు. సకాలం వైద్యం అందించటం వల్ల కొందరు ప్రాణాలతో బయటపడుతున్నారు. సరిగ్గా అలాంటి సంఘటనే ఒకటి నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్‌లో చోటు చేసుకుంది. ఇక్కడ డాక్టర్ అయిన వధువు చొరవతో ఒక మహిళతో ప్రాణాలతో బయటపడింది.
కొల్హాపూర్ జిల్లాలోని బండివాడేలో జరిగిన ఒక వివాహ వేడుక గందగోళంగా మారింది. పెళ్లికి వచ్చిన ఓ మహిళా అతిథి అకస్మాత్తుగా తల తిరుగుతున్నట్లు అనిపించి వేదికపైనే కుప్పకూలిపోయింది. ఈ క్రమంలోనే.. డాక్టర్ అయిన వధువు వెంటనే స్పందించి.. వేదికపై ఉన్న మహిళకు చికిత్స చేసి ఆమెను బతికించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..వధువు సకాలంలో స్పందించడం వలన ఆమె ప్రాణాపాయం నుండి బయటపడింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. నెటిజన్లు వధువును ప్రశంసలతో ముంచెత్తారు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..