హైదరాబాద్ లో అదృశ్యమైన చిన్నారి.. ఢిల్లీలో ప్రత్యక్షం.. చివరికి ఏం జరిగిందంటే

|

Feb 23, 2022 | 10:10 AM

చిన్నారులు ఇంటి నుంచి అదృశ్యమైతే తల్లిదండ్రుల వేదనను మాటల్లో చెప్పలేం. అనుక్షణం వారి గురించే ఆలోచిస్తూ తీవ్రంగా కుంగిపోతారు. వారి ఆచూకీ తెలుసుకునేందుకు..

హైదరాబాద్ లో అదృశ్యమైన చిన్నారి.. ఢిల్లీలో ప్రత్యక్షం.. చివరికి ఏం జరిగిందంటే
Kidnap
Follow us on

చిన్నారులు ఇంటి నుంచి అదృశ్యమైతే తల్లిదండ్రుల వేదనను మాటల్లో చెప్పలేం. అనుక్షణం వారి గురించే ఆలోచిస్తూ తీవ్రంగా కుంగిపోతారు. వారి ఆచూకీ తెలుసుకునేందుకు విశ్వప్రయత్నాలన్నీ చేస్తారు. వాళ్ల ఆచూకీ లభ్యమై వారిని ఒడి చేర్చుకునేంత వరకూ మనసు స్థిమితపడదు. సరిగ్గా హైదరాబాద్(Hyderabad) లో అలాంటి ఘటనే జరిగింది. ఇంటి వద్ద ఆడుకుంటున్న ఆరేళ్ల చిన్నారి అనూహ్యంగా అదృశ్యమయ్యాడు. చుట్టుపక్కలా వెతికినా.. ఆచూకీ లభించకపోవడంతో ఆ తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులకు బాలుడు ఢిల్లీ(Delhi) లో ఉన్నట్లు సమచారం అందింది. హుటాహుటిన ఢిల్లీ వెళ్లిన పోలీసులు బాలుడిని అతని తండ్రికి అప్రగించారు. అయితే హైదరాబాద్ లో అదృశ్యమైన బాలుడు ఢిల్లీకి ఎలా వచ్చాడనేది ప్రశ్నార్థకంగా మారింది.

హైదరాబాద్ మల్లేపల్లి బడీ మసీదు ప్రాంతంలో నివాసముంటున్న కారు డ్రైవర్‌ హనీఫ్‌ కుమారుడు ఆయాన్‌.. ఈనెల 17న తప్పిపోయాడు. బాలుడి కోసం తల్లిదండ్రులు చుట్టుపక్కలా వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మూడు కమిషనరేట్ల పరిధిలో విస్తృతంగా గాలించారు. బాలుడి వివరాలను ట్విటర్‌, ఫేస్‌బుక్‌ వంటి సమామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేశారు. వీటిని చూసిన దిల్లీలోని నిజాముద్దీన్‌ పోలీసులు ఆదివారం హైదరాబాద్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాలుడు తమ వద్ద ఉన్నాడని, వచ్చి తీసుకెళ్లాలని కోరారు. దీంతో ఇన్‌స్పెక్టర్‌ నరసింహ, బాలుడి తండ్రి హనీఫ్ లు ఢిల్లీకి బయల్దేరారు.

ఈ నెల 19న ఒక అపరిచిత వ్యక్తి ఠాణాకు వచ్చి తన ఆధార్‌, ఇతర వివరాలు నమోదుచేసి ఆయాన్‌ను అప్పగించి వెళ్లాడంటూ నిజాముద్దీన్‌ పోలీసులు చెప్పారు. మల్లేపల్లిలో ఉన్న బాలుణ్ని ఆ వ్యక్తే చేరదీసి రైల్లో దిల్లీకి తీసుకెళ్లాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధరించారు. అయితే అపరిచిత వ్యక్తి వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. బాలుడిని క్షేమంగా అతని తండ్రికి అప్పగించారు.

Also Read

Stock Market: లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 307, నిఫ్టీ 95 పాయింట్ల ప్లస్..

Watch Video: మళ్లీ విస్ఫోటనం చెందిన ఎట్నా అగ్నిపర్వతం.. ఆ ప్రాంతంలో రెడ్ అలెర్ట్‌.. వీడియో..

Viral News: పిల్లలు ఇంటర్నెట్‌ వాడకుండా చేయాలనుకున్నాడు.. పోలీస్‌ స్టేషన్‌ మెట్లెక్కాడు.. ఇంతకీ ఆ తండ్రి ఏం చేశాడంటే..