Telangana: తెలంగాణ డీజీపీ పేరుతో వాట్సప్ కాల్.. తీరా చూస్తే షాక్.. బరితెగిస్తున్న సైబర్ కేటుగాళ్ళు!

తెలంగాణ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రవి గుప్తా ఫోటోను వాడుకుని అగంతకులు సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. అయితే ఈసారి ఏకంగా పాకిస్తాన్ నుండే ఈ దుచర్యకు పాల్పడ్డారు. +92 నెంబర్ తో తెలంగాణ డీజీపీ రవి గుప్తా ఫోటోను వాడుకుని వ్యాపారవేత్తలను టార్గెట్ చేస్తున్నారు సైబర్ నెరగాళ్ళు.

Telangana: తెలంగాణ డీజీపీ పేరుతో వాట్సప్ కాల్.. తీరా చూస్తే షాక్.. బరితెగిస్తున్న సైబర్ కేటుగాళ్ళు!
Fake Whatsapp Dp

Edited By:

Updated on: May 21, 2024 | 11:51 AM

సైబర్ నేరగాళ్ల బారిన పడ్డాడు హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త.. తనకి ఒక గుర్తు తెలియని నెంబర్ నుండి వాట్సాప్ కాల్ వచ్చింది. తనతో పాటు తన కూతురికి సైతం +92 నంబర్ నుండి వాట్స్అప్ కాల్ వచ్చింది. తన కూతురు డ్రగ్స్ కేసులో డిజిటల్ అరెస్ట్ అయిందని వ్యాపారవేత్తను ఆయన కుమార్తెను నమ్మించారు. అయితే సాధారణ స్థితిలో అయితే ఇది ఒక ఫేక్ కాల్ అని ఈజీగా వ్యాపారవేత్త కొట్టిపడేయవచ్చు. కానీ ఇక్కడ వాట్సాప్ డీపీకి తెలంగాణ డీజీపీ ఫోటో ఉండటంతో సదురు వ్యాపారవేత్త కాస్త ఆందోళన చెందాడు. వెంటనే అసలు నిజం చేసుకునేందుకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు.

తెలంగాణ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రవి గుప్తా ఫోటోను వాడుకుని అగంతకులు సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. అయితే ఈసారి ఏకంగా పాకిస్తాన్ నుండే ఈ దుచర్యకు పాల్పడ్డారు. +92 నెంబర్ తో తెలంగాణ డీజీపీ రవి గుప్తా ఫోటోను వాడుకుని వ్యాపారవేత్తలను టార్గెట్ చేస్తున్నారు సైబర్ నెరగాళ్ళు. ఏదో ఒక కేసు పేరు చెప్పి అరెస్టు చేస్తున్నామని బెదిరింపులకు పాల్పడుతున్నారు. అరెస్టు నుండి తమను తప్పించేందుకు కొంత మొత్తంలో డబ్బులు చెల్లించాలని వేధిస్తున్నారు. పలువురు భయపడి డబ్బులు చెల్లించే స్టేజ్ వరకు వెళ్తున్నారు. మరికొందరు చాకచక్యంతో ఇది ఫేక్ కాల్ అని నిర్ధారించుకుని పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు.

ఇటీవల కాలంలో ఈ తరహా సైబర్ నేరాలు రాష్ట్రంలో విపరీతంగా పెరిగాయి.. గత కొద్ది రోజుల క్రితమే తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంత కుమారి ఫోటోతో సైతం ఇదే రీతిలో సైబర్ క్రైమ్‌కు పాల్పడ్డారు నిందితులు. ఉన్నత హోదాలో ఉన్న అధికారుల ఫోటోలు ఈజీగా ఇంటర్నెట్‌లో దొరుకుతుండడం, వాటిని ఆసరా చేసుకుని ఏదో ఒక సిమ్ కార్డ్ తీసుకుని దానికి వాట్సాప్ ఇన్స్టాల్ చేసి వీరి ఫోటోలను వాట్సాప్ డీపీలుగా పెట్టి వ్యాపారవేత్తలను టార్గెట్ చేస్తూ సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. ఈ వ్యవహారంపై తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సీరియస్ తీసుకుంది. ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర నిందితులను పట్టుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అయితే తెలంగాణ డీజీపీ ఫోటోను వాడుకుని కాల్స్ చేసిన వ్యక్తి ఇప్పటివరకు ఐడెంటిఫై కాలేదు. నంబర్ ఆధారంగా ఇప్పటికే ట్రాయ్ కి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ పోలీసులు లేఖ రాశారు. వారు ఇచ్చే సమాచారం ఆధారంగా నిందితులను పట్టుకునే పనిలో పడ్డారు.

అనుమానాస్పదంగా వచ్చే ఇలాంటి కాల్స్ ను ఎట్టి పరిస్థితుల్లో నమ్మవద్దని పోలీసులు సూచిస్తున్నారు. ఏదైనా అనుమానం కలిగించేలా కాల్స్ వస్తే వెంటనే సైబర్ పోర్టల్ నంబర్ 1930 నెంబర్ కి కాల్ చేసి ఫిర్యాదు చేయాల్సిందిగా పోలీసులు సూచిస్తున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…