Hyderabad: ముస్లీం మతపెద్దలకు ధన్యవాదాలు తెలిపిన సీవీ ఆనంద్.. ఎందుకంటే

Edited By:

Updated on: Sep 24, 2023 | 10:37 AM

35 ఏళ్ల తర్వాత ఒకేరోజు హిందూ, ముస్లిం పండగలు రానున్నాయి. ఈ నెల 28న వినాయక నిమజ్జనాలు ఉండటంతో అదే రోజు మిలాద్‌ ఉన్‌ నబీ ర్యాలీ ఉండటంతో పోలీసులు భద్రత విషయంలో కాస్త కంగారు పడ్డారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రత ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ సందర్భంలో ముస్లిం మత పెద్దలు ఓ మంచి నిర్ణయం తీసుకున్నారు. నిమజ్జనం దృష్ట్యా 28న జరగాల్సిన మిలాద్‌ ఉన్‌ నబీ ర్యాలీని వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. ఆ తేదీకి బదులు అక్టోబర్‌ 1వ తేదీన నిర్వహించాని నిర్ణయించారు. ముస్లిం మత పెద్దల నిర్ణయం పట్ల సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.

Published on: Sep 24, 2023 07:00 AM