Telangana: పదేళ్లుగా ఆ కుటుంబానికి ఆసరాగా ఉన్న గోమాత మృతి.. తల్లిడిల్లిన కుటుంబం చేసిందంటే?

సాధారణంగా మనుషులు చనిపోతే అంత్యక్రియలు నిర్వహించడం మన ఆచారం. కానీ, తమ ఇంటి సభ్యురాలిగా భావించిన ఒక గోవు మరణిస్తే, ఆ కుటుంబం మొత్తం కన్నీరు మున్నీరైంది. ఆ గోమాతకు అంతిమ యాత్ర నిర్వహించి అంత్యక్రియలు చేశారు. అకాల వర్షం ఆ ఇంట విషాదాన్ని నింపింది. ప్రాణం లేని ఆ మూగజీవిని చూసి ఆ యజమాని కన్నీరు మున్నీరవుతోంది.

Telangana: పదేళ్లుగా ఆ కుటుంబానికి ఆసరాగా ఉన్న గోమాత మృతి.. తల్లిడిల్లిన కుటుంబం చేసిందంటే?
Cow Funerals

Edited By:

Updated on: Mar 18, 2026 | 8:56 PM

సాధారణంగా మనుషులు చనిపోతే అంత్యక్రియలు నిర్వహించడం మన ఆచారం. కానీ, తమ ఇంటి సభ్యురాలిగా భావించిన ఒక గోవు మరణిస్తే, ఆ కుటుంబం మొత్తం కన్నీరు మున్నీరైంది. ఆ గోమాతకు అంతిమ యాత్ర నిర్వహించి అంత్యక్రియలు చేశారు. అకాల వర్షం ఆ ఇంట విషాదాన్ని నింపింది. ప్రాణం లేని ఆ మూగజీవిని చూసి ఆ యజమాని కన్నీరు మున్నీరవుతోంది. పదేళ్లుగా తన ఇంట్లో మనిషిలా పెరిగిన ఆవు.. పిడుగుపాటుకు బలైపోవడంతో,కన్నబిడ్డకు చేసినట్లే ఆవుకు అంతిమ సంస్కారాలు నిర్వహించి తన ప్రేమని చాటుకుంది ఓ మహిళ. హృదయాన్ని కదలించిన ఈ ఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది.

మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన బొమ్మల చంద్రమ్మ పదేళ్లుగా ఓ ఆవును ఎంతో అపురూపంగా సాకుతోంది. పాలు ఇవ్వడమే కాదు, ఆ కుటుంబంలో ఒక సభ్యురాలిగా ఆ ఆవు కలిసిపోయింది. అయితే, మంగళవారం (మార్చి 17) రాత్రి కురిసిన అకాల వర్షం ఆ మూగజీవి ప్రాణాలను బలితీసుకుంది. చంద్రమ్మ తన వ్యవసాయ క్షేత్రం వద్ద ఆవులను కట్టేయగా, ఒక్కసారిగా పిడుగు పడటంతో ఆ ఆవు అక్కడికక్కడే మృతి చెందింది. పదేళ్లుగా తన కళ్ల ముందే తిరిగిన ఆవు విగతజీవిగా పడి ఉండటంతో చంద్రమ్మ తల్లడిల్లిపోయింది.

కేవలం జంతువు కదా అని వదిలేయకుండా.. మనుషులకు నిర్వహించినట్లే ఆవుకు కూడా అంతిమ సంస్కారాలు నిర్వహించాలని నిర్ణయించుకుంది. హిందూ సంప్రదాయం ప్రకారం ఆవుకు పసుపు, కుంకుమ పూసి, పూలతో అలంకరించి, కొబ్బరికాయ కొట్టి కన్నీటి వీడ్కోలు పలికింది. మనుషుల లాగే గోమాత కూడా మన ఇంట్లో భాగమే అంటూ ఆమె పడ్డ ఆవేదన గ్రామస్తులను సైతం కదిలించింది. తన జీవనాధారమైన ఆవు మృతి చెందడంతో చంద్రమ్మ కుటుంబం ఆర్థికంగానూ దెబ్బతింది. మూగజీవి పై ఆమె చూపిన మమకారం చూసి స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. ప్రభుత్వం స్పందించి,పిడుగుపాటుకు గురైన పశువుల నష్టపరిహారం కింద తనను ఆదుకోవాలని ఆమె వేడుకుంటోంది.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us