Covid Vaccine: కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న తెలంగాణ గవర్నర్ భర్త.. స్ఫూర్తి నింపారన్న గవర్నర్ తమిళిసై..

Covid Vaccine: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై భర్త, ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ పి. సౌందరరాజన్ కోవిడ్ టీకా వేయించుకున్నారు.

Covid Vaccine: కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న తెలంగాణ గవర్నర్ భర్త.. స్ఫూర్తి నింపారన్న గవర్నర్ తమిళిసై..

Updated on: Feb 04, 2021 | 5:12 AM

Covid Vaccine: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై భర్త, ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ పి. సౌందరరాజన్ కోవిడ్ టీకా వేయించుకున్నారు. వైద్యాధికారులు ఆయనకు టీకా వేశారు. కార్పొరేట్‌ ఆస్పత్రిలో వైద్యుడిగా సేవలందిస్తున్న ఆయన.. కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకునేందుకు ముందుకు వచ్చారు. వ్యాక్సినేషన్ కోసం తన పేరును నమోదు కూడా చేశారు. ఈ నేపథ్యంలో వైద్యాధికారులు ఆయన కొవిడ్ టీకా వేశారు. కాగా, తన భర్త సౌందరరాజ్ కొవిడ్ టీకా వేసుకోవడంపై గవర్నర్ తమిళిసై స్పందించారు. అందరూ భయపడుతూ వ్యాక్సినే వేసుకోవడానికి వెనకడుగు వేస్తున్న తరుణంలో ఆయన టీకా వేసుకుని స్ఫూర్తి నింపారని కొనియాడారు. వ్యాక్సిన్ వేసుకోవడానికి వైద్య సిబ్బంది భయపడొద్దని ఆమె సూచించారు. ఫ్రంట్ వారియర్స్ అయిన వైద్యులే ఇలా వెనుకడుగు వేయడం సరికాదన్నారు. కాగా, తెలంగాణ వ్యాప్తంగా ప్రైవేటు వైద్యులకు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రైవేటు వైద్య సిబ్బందికి ప్రభుత్వ వైద్యాధికారులే కోవిడ్ టీకా వేస్తున్నారు.

Also read:

రేషన్‌కు ఓటీపీ కష్టాలు, ఆధార్ కేంద్రాలకు క్యూ కడుతున్న పేదలు, ప్రభుత్వం తెచ్చిన కొత్త నిబంధనతో ఉరుకుపరుగులు

Vivaha Bhojanambu: ‘ఏబీసీడీ.. నువ్వు నా జోడి’.. ‘వివాహభోజనంబు’ నుంచి తొలి పాట విడుదల..