Telangana: కంటైనర్ లారీ బోల్తా.. దగ్గరకు వెళ్లి చూసి స్థానికులు షాక్..!

|

May 07, 2022 | 10:22 AM

నోరు లేని మూగజీవాలు. మనందరికీ ఎంతో సాయంగా నిలుస్తాయి... తప్ప హాని చేయవు. కానీ.. కొందరు అక్రమ వ్యాపారులు కర్కశంగా కబేళాలకు తరలిస్తూ వాటి రక్తపుమాంసాలతో కాసులు గడిస్తున్నారు.

Telangana: కంటైనర్ లారీ బోల్తా.. దగ్గరకు వెళ్లి చూసి స్థానికులు షాక్..!
representative image
Follow us on

నిజామాబాద్ జిల్లాలో మొన్న అంబులెన్స్‌లో ఆవులను తరలిస్తుండగా.. వెహికల్‌ కాలిపోయి మూగజీవాల అక్రమ రవాణా గుట్టు బయటపడింది. ఇప్పుడు కంటైనర్‌లో గోవులను కుక్కి అక్రమంగా తరలిస్తుండగా.. ఆ వెహికల్‌ ప్రమాదానికి గురి కావడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఇచ్చోడ మండలం సాథ్ నెంబర్ గ్రామం వద్ద కంటైనర్ లారీ బోల్తా పడింది. అందులో పరిమితికి మించి గాలి, నీరు లేకుండా 70కి పైగా ఆవులు, ఎడ్లను తరలిస్తున్నారు. ప్రమాదంలో 10 మూగ జీవాల మృత్యువాత పడ్డాయి. కంటైనర్‌ లారీ ప్రమాదంలో చిక్కుకుపోయిన పశువులను గ్రామస్తులే రెస్క్యూ చేశారు. ఘటనా స్థలం నుంచి డ్రైవర్, క్లీనర్ పరారయ్యారు. ఆవులను ఎక్కడి నుంచి ఎక్కడికి తీసికెళ్తున్నారనే విషయం తేలాల్సి ఉంది. కాగా పశువుల అక్రమ రవాణాను అరిక‌ట్టాల‌ని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తూ వ‌స్తున్నా.. ఇంకా చాలాచోట్ల ఈ  దందా కొన‌సాగుతూనే ఉంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇత‌ర రాష్ట్రాల నుంచి ఆవుల అక్ర‌మ ర‌వాణా కొన‌సాగుతూనే ఉంది. ఇలా కొంద‌రు అక్ర‌మార్కులు ఎలాంటి భ‌యం లేకుండా య‌ధేచ్ఛగా ర‌వాణా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.

నిబంధనలను గాలికి వదిలేసి…

పశువుల రవాణా, క్రయవిక్రయాలపై కేంద్రం పలు కఠిన నిబంధనలు విధించింది. సంతల్లో విక్రయానికి ఎన్ని పశువులు, ఎక్కడెక్కడి నుంచి వచ్చాయన్న వివరాలను రికార్డుల్లో క్లియర్‌గా రాయాలి. పశువైద్యాధికారులు అందులోని ఆరోగ్యకరమైన పశువులను పరీక్షించి వాటి విక్రయాలకు మాత్రమే పర్మిషన్ ఇవ్వాలి. వ్యవసాయానికి మాత్రమే వినియోగించుకునేలా ధ్రువీకరణ పత్రం తీసుకోవాలి. ఆవులు, లేగదూడలను విక్రయాలకు తీసుకూడదు. కానీ ఎక్కడా కనీస నిబంధనలు అమలు కావడం లేదు. రాత్రి సమయంలో పశువులను లారీలలో కుక్కి కబేళాలకు తరలిస్తున్నారు. పశువుల క్రయవిక్రయాలు జరిగే ప్రాంతాల్లో ఒక్క ఆఫిసర్ కూడా అందుబాటులో ఉండడం లేదు. సంతకు సంబంధించిన రికార్డులు కూడా అందుబాటులో ఉండడం లేదు.

Also Read: Telangana: కట్టుకున్నవాడిని కాదని, ప్రియుడితో వెళ్లింది. కానీ, కొన్ని రోజుల్లోనే సీన్‌ రివర్స్‌