
మ్యాజిక్ ఫిగర్. దీనికోసం పార్టీలు పడిన ఆరాటాలు, చేసిన పోరాటాలు, వేసిన డ్రామాలు అన్నీఇన్నీ కావసలు. మున్నిపల్ ఎన్నికల ఫలితాల్లో ఒకరికి ఎక్కువ, మరొకరికి తక్కువ సీట్లు వచ్చుండొచ్చు. బట్.. స్టోరీ అక్కడితోనే అయిపోలేదని పార్టీలకు తెలుసు. గేమ్ అంతా రిజల్ట్స్ తరువాతే ఉంటుందనీ తెలుసు. లాస్ట్ 2 డేస్.. తెలంగాణ వ్యాప్తంగా జరిగింది కూడా అదే. సరిగ్గా 16వ తేదీన ప్రమాణస్వీకారానికి విజేతలను తీసుకొచ్చి మేయర్, మున్సిపల్ ఛైర్మన్ పదవులను దక్కించుకుంటాయనుకున్నాం. ఒక గుర్తుపై గెలిచి మరో గుర్తు పార్టీల్లోకి వెళ్తారనే ఎక్స్‌పెక్ట్ చేశాం. కాని, అంతకు మించి జరిగింది. ఏకంగా ఇటువైపు ఉన్న పార్టీలే అటువైపు వెళ్లాయి. ఆ గట్టునే ఉంటామన్న పార్టీలు ఈ గట్టుకొచ్చాయి. మున్సిపల్ ఫలితాలప్పుడు కూడా ఇంత టెన్షన్ పడి ఉండరేమో. ఎన్నెన్ని ఉద్రిక్తతలో, ఎన్నెన్ని టెన్షన్లో. పార్టీల అగ్రనేతలైతే.. నిద్ర లేని రాత్రులు గడిపారు. గెలిచిన వాళ్లు ఎక్కడున్నారు, ఎక్కడికి పోతున్నారు, మనవైపే ఉంటారా, అటువైపు జంప్ అవుతారా.. ఈ టెన్షన్లతో బీపీలు, షుగర్లు మరికాస్త పెంచుకున్నారు. జనరల్‌గా ప్రజాతీర్పు వచ్చిన తరువాత ఇక అదే అల్టిమేట్. పెద్దగా మార్పులుండవ్. కాని, పార్టీలను ప్రశాంతంగా నిద్రపోనివ్వొద్దు అనుకున్నారో ఏమో.. ఏకంగా 35 మున్సిపాలిటీలు, 4 కార్పొరేషన్లలో పర్ఫెక్ట్...