KCR Election Campaign: కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం రాబోతుంది.. మాజీ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణలో 12 పార్లమెంట్ సీట్లు గెలుస్తామని.. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం రాబోతుందని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి ఈసారి 200 సీట్లు కూడా దాటే పరిస్థితి లేదన్నారు. ఖమ్మంలో జరిగిన రోడ్‌షోలో బీఆర్ఎఎస్ శ్రేణుల్లో కొత్త జోష్‌ నింపారు కేసీఆర్‌. ఎన్నికల్లో నామా నాగేశ్వరరావుని ఎంపీగా గెలిపిస్తే కేంద్రంలో రాబోయే సంకీర్ణ ప్రభుత్వంలో కేంద్ర మంత్రి అవుతారని కేసీఆర్ జోస్యం చెప్పారు.

KCR Election Campaign: కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం రాబోతుంది.. మాజీ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
Kcr In Khammam
Follow us

|

Updated on: Apr 30, 2024 | 8:08 AM

తెలంగాణలో 12 పార్లమెంట్ సీట్లు గెలుస్తామని.. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం రాబోతుందని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి ఈసారి 200 సీట్లు కూడా దాటే పరిస్థితి లేదన్నారు. ఖమ్మంలో జరిగిన రోడ్‌షోలో బీఆర్ఎఎస్ శ్రేణుల్లో కొత్త జోష్‌ నింపారు కేసీఆర్‌. ఎన్నికల్లో నామా నాగేశ్వరరావుని ఎంపీగా గెలిపిస్తే కేంద్రంలో రాబోయే సంకీర్ణ ప్రభుత్వంలో కేంద్ర మంత్రి అవుతారని కేసీఆర్ జోస్యం చెప్పారు. కేంద్ర మంత్రిగా ఖమ్మం అభివృద్ధికి పాటుపడుతారని కేసీఆర్ తెలిపారు. రాష్ట్రంలో తాను ఎక్కడికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు.

ఖమ్మం మయూరి సెంటర్‌లో జరిగిన రోడ్ షోలో తెలంగాణలో ఉన్న కేంద్రమంత్రి, ముగ్గురు ఎంపీలపై విరుచుకుపడ్డారు కేసీఆర్‌. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ టార్గెట్ గా కేసీఆర్‌ ప్రచారం కొనసాగుతోంది. ఖమ్మంలో జరిగిన రోడ్‌షోలో బీజేపీపై విమర్శల దాడి చేశారు కేసీఆర్‌. ధాన్యం కొనమంటే కేంద్రం మొండికేసిందన్నారు. తెలంగాణ ఎంపీలు వెళ్లి దీనిపై అడిగితే కేంద్రమంత్రి నూకలు తినమని చెప్పారని గుర్తు చేశారు కేసీఆర్‌. ప్రధాని మోదీ గోదావరి జలాలు తీసుకు వెళ్లి పక్క రాష్ట్రాలకు ఇస్తానని చెబుతుంటే ఇక్కడున్న బీజేపీ ఎంపీలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. సీఎం రేవంత్‌రెడ్డి కూడా దీనిపై మాట్లాడటం లేదన్నారు. తెలంగాణ వాటా తేల్చే వరకు తల తెగిపడ్డా ఒప్పుకునేది లేదని బీఆర్ఎస్ హయాంలో చెప్పామన్నారు కేసీఆర్‌.

మరోవైపు ఈ ఎన్నికల్లో బీజేపీకి 200 సీట్లు కూడా రావని జోస్యం చెప్పారు కేసీఆర్‌. BRS 12 సీట్లు గెలుస్తుందన్నారు. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుందని, నామా నాగేశ్వరరావు కేంద్రమంత్రి అవుతారన్నారు. మన హక్కులు, మన నీళ్ళ కోసం పోరాటం చేయాలంటే BRS గెలవాలన్నారు కేసీఆర్‌. తెలంగాణలో కరెంట్‌ కష్టాలు మొదలయ్యాయన్నారు కేసీఆర్‌. ఓయూలో కరెంటు కోతలు ఉన్నాయని, నీళ్ళు కూడా ఇవ్వడం లేదన్నారు. రైతు రుణమాఫీ పై..హరీష్ రాజీనామా చేసి వెళితే ఈ ముఖ్యమంత్రి తోక ముడిచారన్నారు కేసీఆర్‌. తులం బంగారం గురించి అడిగితే కాంగ్రెస్‌ ప్రభుత్వం కస్సు మంటోందని, రుణ మాఫీ అడిగితే రైతులను చెప్పులతో కొడతామంటున్నారని మండిపడ్డారు కేసీఆర్‌.

ఖమ్మం జిల్లాలో పంటలు ఎండిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దుస్థితికి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమన్నారు. ఇంకా చాలా మంది రైతులకు రైతుబంధు రాలేదని.. రైతు బంధు కోసం కొట్లాడతామని మాటిచ్చారు. వీళ్ల మెడలు వంచి పాత పద్ధతిలో రైతు బంధు అందరికీ వచ్చేలా చేస్తానని హామీ ఇచ్చారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో యువత ఆలోచించి ఓటు వేయాలని కేసీఆర్ కోరారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Latest Articles
మహిళల్లో సంతాన లేమికి కారణం అవుతున్న మొబైల్ అడిక్షన్.. జర భద్రం!
మహిళల్లో సంతాన లేమికి కారణం అవుతున్న మొబైల్ అడిక్షన్.. జర భద్రం!
ఐష్‌ డెడికేషన్‌కు అభిమానులు ఫిదా.. చేతి కట్టుతోనే ర్యాంప్‌ వాక్‌.
ఐష్‌ డెడికేషన్‌కు అభిమానులు ఫిదా.. చేతి కట్టుతోనే ర్యాంప్‌ వాక్‌.
భారత టీ20 ప్రపంచకప్‌ జట్టులో SRH తుఫాన్ బ్యాటర్ ఎంట్రీ..
భారత టీ20 ప్రపంచకప్‌ జట్టులో SRH తుఫాన్ బ్యాటర్ ఎంట్రీ..
అమెరికాలో బైడెన్‌ ప్రభుత్వం సంచలన నిర్ణయం.! గంజాయి బ్యాచ్‌లకు ఊరట
అమెరికాలో బైడెన్‌ ప్రభుత్వం సంచలన నిర్ణయం.! గంజాయి బ్యాచ్‌లకు ఊరట
లాంచింగ్‌కు సిద్ధమైన వివో నయా ఫోన్‌.. కళ్లు చెదిరే ఫీచర్స్‌..
లాంచింగ్‌కు సిద్ధమైన వివో నయా ఫోన్‌.. కళ్లు చెదిరే ఫీచర్స్‌..
పెట్టిపుట్టావ్ బ్రో..! ఆ హీరోతో కీర్తిసురేష్ లిప్ లాక్‌
పెట్టిపుట్టావ్ బ్రో..! ఆ హీరోతో కీర్తిసురేష్ లిప్ లాక్‌
దేశంలోని బెస్ట్‌ IIT కోర్సులు, టాప్‌ IIT కాలేజీలు ఇవే..
దేశంలోని బెస్ట్‌ IIT కోర్సులు, టాప్‌ IIT కాలేజీలు ఇవే..
కుక్క ఆకలి తీర్చుకునేందుకు పడరాని పాట్లు..!
కుక్క ఆకలి తీర్చుకునేందుకు పడరాని పాట్లు..!
బెంగళురు, హైదరాబాద్ జట్ల మధ్యే ఫైనల్.. కారణం ఇదిగో
బెంగళురు, హైదరాబాద్ జట్ల మధ్యే ఫైనల్.. కారణం ఇదిగో
భారత మార్కెట్లోకి ఎంట్రీ ఇస్తున్న మరో ఫోల్డబుల్‌ ఫోన్‌.. వివో నుం
భారత మార్కెట్లోకి ఎంట్రీ ఇస్తున్న మరో ఫోల్డబుల్‌ ఫోన్‌.. వివో నుం
ఐష్‌ డెడికేషన్‌కు అభిమానులు ఫిదా.. చేతి కట్టుతోనే ర్యాంప్‌ వాక్‌.
ఐష్‌ డెడికేషన్‌కు అభిమానులు ఫిదా.. చేతి కట్టుతోనే ర్యాంప్‌ వాక్‌.
అమెరికాలో బైడెన్‌ ప్రభుత్వం సంచలన నిర్ణయం.! గంజాయి బ్యాచ్‌లకు ఊరట
అమెరికాలో బైడెన్‌ ప్రభుత్వం సంచలన నిర్ణయం.! గంజాయి బ్యాచ్‌లకు ఊరట
పెరుగుతో కాన్సర్‌కు చెక్‌.. 14 లక్షలమందిపై పరిశోధనలు.
పెరుగుతో కాన్సర్‌కు చెక్‌.. 14 లక్షలమందిపై పరిశోధనలు.
పురుషుల సంతానలేమికి తల్లే కారణమా.? CCMB అధ్యయనం..
పురుషుల సంతానలేమికి తల్లే కారణమా.? CCMB అధ్యయనం..
భారత్‌కు పాఠాలు చెప్పొద్దు.! దేశీస్‌ డిసైడ్‌ సదస్సులో వ్యాఖ్యలు..
భారత్‌కు పాఠాలు చెప్పొద్దు.! దేశీస్‌ డిసైడ్‌ సదస్సులో వ్యాఖ్యలు..
టిష్యూ పేపర్‌ కలకలం.. విమానం నుంచి దిగిపోయిన ప్రయాణీకులు.!
టిష్యూ పేపర్‌ కలకలం.. విమానం నుంచి దిగిపోయిన ప్రయాణీకులు.!
ప్రభాస్‌ లైఫ్‌లోకి ప్రత్యేకమైన వ్యక్తా ?? టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీ
ప్రభాస్‌ లైఫ్‌లోకి ప్రత్యేకమైన వ్యక్తా ?? టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీ
ఆడుకుంటూ ఆడుకుంటూ కుప్పకూలిన చిన్నారి.. ఆ డాక్టర్‌ ఏం చేసిందంటే ?
ఆడుకుంటూ ఆడుకుంటూ కుప్పకూలిన చిన్నారి.. ఆ డాక్టర్‌ ఏం చేసిందంటే ?
‘గున్న ఏనుగుకు జెడ్‌ కేటగిరీ సెక్యూరిటీ’.
‘గున్న ఏనుగుకు జెడ్‌ కేటగిరీ సెక్యూరిటీ’.
గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన మందుల ధరలు..
గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన మందుల ధరలు..