
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు 70 ఏళ్లు పూర్తి చేసుకొని నేడు 71 వసంతంలోకి అడుగుట్టారు.. కేసీఆర్ పుట్టినరోజు సదర్భంగా పలువురు ప్రముఖులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా.. ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. బీఆర్ఎస్ నేతలు, శ్రేణులు కూడా పెద్ద ఎత్తున కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలను నిర్వహిస్తున్నారు. అయితే.. కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.. ఎక్స్‌లో బర్త్‌డే విషెస్ చెబుతూ పోస్ట్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి.. సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలంటూ ఆకాంక్షించారు.. రాష్ట్రాభివృద్ధికి పాటుపడుతూ ప్రజాసేవలో నిమగ్నం కావాలని రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.
గజ్వేల్ నియోజకవర్గ శాసనసభ్యులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి గారు వారికి హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు… pic.twitter.com/OTtysLYlya
— Telangana CMO (@TelanganaCMO) February 17, 2025
తండ్రి కేసీఆర్ బర్త్‌డే సందర్భంగా కేటీఆర్ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.. సోషల్ మీడియా వేదికగా కేసీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు కేటీఆర్.. ప్రతి తండ్రీ.. తమ పిల్లలకు హీరో.. కానీ, నా తండ్రి నా ఒక్కడికే కాదు.. తెలంగాణకే హీరో కావడం నా అదృష్టం.. తెలంగాణ కోసం హద్దుల్లేని నిబద్ధతతో వచ్చారు.. పనిచేశారు .. తెలంగాణ అనే కలను ప్రేమించారు.. వ్యక్తిగత జీవితం గురించి ఆలోచించకుండా సాధించారు అంటూ కేటీఆర్ పేర్కొన్నారు. వ్యక్తిగత జీవితం గురించి ఆలోచించకుండా నా తండ్రి తెలంగాణ సాధించారు. మీ వారసుడిగా నా జీవితంలో ప్రతి క్షణాన్ని ఈ రాష్ట్రం కోసం జరిపే పోరాటానికి అర్పిస్తానని మాటిస్తున్నాను.. అంటూ కేటీఆర్ పోస్ట్ చేశారు.
Warm greetings to Telangana’s former Chief Minister, Sri K. Chandrashekar Rao (KCR) garu, on his birthday. May God bless him with good health, happiness, and a fulfilling life. pic.twitter.com/rLHYG15IIU
— YS Jagan Mohan Reddy (@ysjagan) February 17, 2025
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌కు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ కూడా శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు వైఎస్ జగన్ ఎక్స్ లో ఒక పోస్టు చేశారు.
కాగా.. కేసీఆర్ పుట్టినరోజును గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు బీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలు.. ఒక్కొక్కరు ఒక్కోవిధంగా కేసీఆర్ బర్త్‌డేను సెలబ్రేట్ చేస్తూ తమ అధినేతపై అభిమానం చాటుకుంటున్నారు. భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం చిన్నకందుకూరు గ్రామంలో కేసీఆర్‌కు డిఫరెంట్‌గా బర్త్‌డే విషెష్ చెప్పాడు ఓ కార్యకర్త.. డ్రోన్ సహాయంతో కేసీఆర్ బర్త్‌డే పోస్టర్‌ను ఆవిష్కరించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశాడు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..