CM KCR Constituencies: కేసీఆర్ పోటీ అక్కడి నుంచే.. గజ్వేల్‌తోపాటు మరో నియోజకవర్గం..

కామారెడ్డి నియోజ‌క‌వ‌ర్గం నుంచి ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు( కేసీఆర్) పోటీ చేయనున్నట్లుగా వెల్లడించారు. దీంతో తెలంగాణ భవన్ వద్ద బీఆర్​ఎస్ శ్రేణుల కోలాహలం నెలకొంది. తెలంగాణ భవన్‌కు చేరుకున్న ఎమ్మెల్యేలు, నేతలు సంబరాలు చేసుకుంటున్నారు.తెలంగాణ భవన్‌కు భారీగా చేరుకున్న బీఆర్​ఎస్ కార్యకర్తలు చేరుకోవడంతో..

CM KCR Constituencies: కేసీఆర్ పోటీ అక్కడి నుంచే.. గజ్వేల్‌తోపాటు మరో నియోజకవర్గం..
CM KCR

Updated on: Aug 21, 2023 | 3:34 PM

బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు( కేసీఆర్) సంచలన ప్రకటన చేశారు. కామారెడ్డి  నియోజ‌క‌వ‌ర్గం నుంచి సీఎం కేసీఆర్ పోటీ చేయనున్నట్లుగా వెల్లడించారు. గజ్వేల్‌తోపాటు కామారెడ్డి నుంచి పోటీ చేయనున్నట్లుగా తెలిపారు. దీంతో తెలంగాణ భవన్ వద్ద బీఆర్​ఎస్ శ్రేణుల కోలాహలం నెలకొంది. తెలంగాణ భవన్‌కు చేరుకున్న ఎమ్మెల్యేలు, నేతలు సంబరాలు చేసుకుంటున్నారు.తెలంగాణ భవన్‌కు భారీగా చేరుకున్న బీఆర్​ఎస్ కార్యకర్తలు చేరుకోవడంతో సందడిగా మారింది. తెలంగాణ భవన్‌ వద్ద గుమికూడిన పలువురు నేతల అనుచరులు ఉన్నారు.

వరుసగా రెండు పర్యాయాలు తెలంగాణలో అధికారం చేపట్టిన సీఎం కేసీఆర్‌.. హ్యాట్రిక్‌ లక్ష్యంగా ఎన్నికలకు రెడీ అవుతున్నారు. గెలుపుపై సీఎం కేసీఆర్ ధీమాతో ఉన్నారు. ఎన్నికల షెడ్యూల్‌ కంటే ముందే అభ్యర్థుల జాబితా.. అదీ వందకు పైనే అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తారనే ఊహాగానాలు నిజమయ్యాయి.

జిల్లాల్లో సంబరాలు అంబరాన్ని అంటాయి..ఆదిలాబాద్‌, మెదక్‌, ఖమ్మం జిల్లాల్లో కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున బాణసంచా కాల్చి సీట్లు పంచుకొని సందడి చేశారు.

అభ్యర్థుల లిస్టు ఇదే..


మరిన్ని తెలంగాణ వార్తల కోసం