Adilabad BRS: గెలుపే లక్ష్యంగా చలిచీమల్లా దండు కట్టి కదులుతున్న ఆదిలాబాద్ గులాబీ సైన్యం..

ఆపరేషన్ ఆకర్ష్‌తతో ఆ నియోజక వర్గంలో కారు పార్టీ కుదేలైపోతోంది. రాత్రికి రాత్రే కీలక‌నేతలంతా పార్టీకి రాంరాం చెప్పేసి అధికార పార్టీలోకి జంప్ అవుతున్నారు. అయితేనేం మా పార్టీకి మేమున్నాం అంటూ కొండంత అండగా నిలుస్తున్నారు‌ అక్కడి కార్యకర్తలు. పార్టీకి మేమే శ్రీరామ రక్షా అంటూ పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటుతామంటున్నారు.

Adilabad BRS: గెలుపే లక్ష్యంగా చలిచీమల్లా దండు కట్టి కదులుతున్న ఆదిలాబాద్ గులాబీ సైన్యం..
Brs Poll Campaign
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Apr 20, 2024 | 8:10 PM

ఆపరేషన్ ఆకర్ష్‌తతో ఆ నియోజక వర్గంలో కారు పార్టీ కుదేలైపోతోంది. రాత్రికి రాత్రే కీలక‌నేతలంతా పార్టీకి రాంరాం చెప్పేసి అధికార పార్టీలోకి జంప్ అవుతున్నారు. అయితేనేం మా పార్టీకి మేమున్నాం అంటూ కొండంత అండగా నిలుస్తున్నారు‌ అక్కడి కార్యకర్తలు. పార్టీకి మేమే శ్రీరామ రక్షా అంటూ పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటుతామంటున్నారు. చలిచీమల దండులా కదిలి ఆదివాసీ ఖిల్లాలో సమర భేరి మోగిస్తామంటున్నారు. మాజీలంతా అధికారం కోసం పోతేపోనీ మేమున్నామంటూ అండగా నిలుస్తున్నారు. ఇంతకీ ఏంటా నియోజకవర్గం.. ఇంతటి ఐక్యత‌ ఈ ఒక్క నియోజక‌వర్గంలోనే ఎలా సాద్యం‌ అయింది.

ఆదివాసీల ఖిల్లా ఆదిలాబాద్.. దశాబ్దంకు పైగా ఈ పార్లమెంట్ కారు పార్టీకి కంచుకోట. కార్యకర్తల బలంబలగంకు తిరుగులేదు. అగ్రనేతలు, మంత్రులు, మాజీమంత్రులతో దశాబ్దానికి పైగా కలకలాడింది. కానీ ఇదంతా వంద రోజుల కిందటి ముచ్చట. రాష్ట్రంలో అధికారం కోల్పోవడంతో ఒక్కసారిగా కుదుపుకు లోనైంది గులాబీ పార్టీ. సిర్పూర్ నుండి మొదలు ముధోల్ వరకు అగ్రనేతలంతా రాజకీయ భవిష్యత్‌ను కాపాడుకునేందుకు రాత్రికి రాత్రే పార్టీకి రాజీనామా చేసి అధికార పార్టీ కండువా కప్పేసుకున్నారు. నిన్నటి వరకు కళకళలాడిన కారు పార్టీ కలవీహీనంగా మారింది. ఇదే సమయంలో పార్లమెంట్ ఎన్నికలు రావడంతో ఇక ఈ ఎన్నికల్లో గెలుపు కష్టమే అన్న బావనకు‌ వచ్చేసింది అదిష్టానం. కానీ‌ అధిష్టానం ఒకలా తలిస్తే అక్కడి‌ కార్యకర్తలు మాత్రం మరోలా ఆలోచించడం అక్కడి గులాబీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపేలా చేస్తోందంట. కారణం ఎక్కడైతే ఓటమి పాలయ్యామో.. అక్కడే గెలిచి నిలవాలని.. పార్టీని కాదని వెళ్లిన అగ్రనేతలకు సత్తా చాటాలని కార్యకర్తలు పిక్స్ అవడమేనంట. పోరాడితే పోయేదేముంది అంటూ కీలక నేతలకే ధైర్యనిస్తున్నారంట ఇక్కడి గులాబీ తమ్ముళ్లు‌.

ఈ లిస్ట్ లో నిర్మల్, ఆదిలాబాద్, ముధోల్ నియోజక వర్గ కార్యకర్తలు ముందు వరుసలో నిలుస్తున్నారంట. కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్‌లో భాగంగా ఇప్పటికే సిర్పూర్‌లో కోనప్ప, ముధోల్‌లో విఠల్ రెడ్డి, నిర్మల్‌లో చోట మోట నేతలు గంపగుత్తగా పార్టీ మారి వెళ్లిపోగా, ఇన్నాళ్లు ఎలాంటి పదవులు రాకున్నా.. పార్టీ కోసం సైన్యంలా కదిలిన కార్యకర్తలు‌ మాత్రం పార్టీకి శ్రీరామ రక్షగా నిలవాలని ఫిక్స్ అయ్యారంట. అందులో భాగంగానే నేతల ఆహ్వానాన్ని వ్యతిరేకిస్తూ పార్టీ ని వీడేందుకు నో చెప్పేసి.. కారు పార్టీతోనే సాగాలని డిసైడ్ అవుతున్నారంట. ఈ నిర్ణయంతో పార్టీ మారాలనుకున్న ఈ పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలు సైతం యూటర్న్ తీసుకున్నట్టు తెలుస్తోంది.

అటు నిర్మల్ లో అయితే మాజీమంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హస్తం గూటికి చేరేందుకు విశ్వ ప్రయత్నాలు చేసి విఫలమవడంతో మరో మార్గం లేక ఉన్న పార్టీలోనే ఉండిపోదామని ఫిక్స్ అయినా.. పాత క్యాడర్ మాత్రం ఇంద్రకరణ్ రెడ్డిని తీవ్రంగానే వ్యతిరేకిస్తున్నారంట. అధికారం కోసం జంప్ అయ్యే నేతలకు తమ‌ సత్తా చూపాలని డిసైడ్ అవుతున్నారంట. మరో వైపు ఉద్యమ సమయం నుండి పార్టీని కాపాడుకున్న నేతల కు‌ జై కొట్టి వారి మార్గనిర్దేశంలో పార్టీని ముందుకు నడిపించేలా అదిష్టానం చర్యలు చేపట్టాలని చెప్తున్నారంట. ఇందులో భాగంగానే మాజీమంత్రి జోగు రామన్న పార్లమెంట్ గెలుపు బాధ్యతలు అప్పగించడంతో ఆయన బాటలో నడిచేందుకు సై అంటున్నారట పార్లమెంట్ నియోజక వర్గ కారు క్యాడర్‌. చూడాలి మరీ చలిచీమల్లా దండు కట్టి కదులుతున్న ఆదిలాబాద్ గులాబీ సైన్యానికి పార్లమెంట్ ఎన్నికల్లో ఈ నియోజక వర్గ ప్రజానికం అండగా నిలుస్తుందో.. లేక అధికారం కోసం జంప్ అయ్యే నేతలను గెలిపించేందుకు ఎందుకంత శ్రమపడుతున్నారంటూ గులాబీ తమ్ముళ్ల శ్రమను బూడిదలో పోసిన పన్నీరుగా మారుస్తుందో..!

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Latest Articles
ఉప్పు తక్కువగా తింటున్నారా..? మీరు డేంజర్‌లో ఉన్నట్టే.. జాగ్రత్త!
ఉప్పు తక్కువగా తింటున్నారా..? మీరు డేంజర్‌లో ఉన్నట్టే.. జాగ్రత్త!
జాతకంలో శని దోషం తొలగాలంటే ఇంట్లో జమ్మి చెట్టుని ఇలా పూజించండి..
జాతకంలో శని దోషం తొలగాలంటే ఇంట్లో జమ్మి చెట్టుని ఇలా పూజించండి..
భారతదేశంలో అత్యంత ఖరీదైన విస్కీ బాటిల్‌ ఏదో తెలుసా?
భారతదేశంలో అత్యంత ఖరీదైన విస్కీ బాటిల్‌ ఏదో తెలుసా?
బ్యాచ్‌ల వారీగా USAకు భారత క్రికెట్ జట్టు.. మొదటి వెళ్లేది వీరే
బ్యాచ్‌ల వారీగా USAకు భారత క్రికెట్ జట్టు.. మొదటి వెళ్లేది వీరే
కమల్ హాసన్ పై డైరెక్టర్ ఫిర్యాదు..
కమల్ హాసన్ పై డైరెక్టర్ ఫిర్యాదు..
హై యూరిక్‌ ఆసిడ్‌తో బాధపడుతున్నారా? నిమ్మకాయ, వామును అద్భుత ఔషధం!
హై యూరిక్‌ ఆసిడ్‌తో బాధపడుతున్నారా? నిమ్మకాయ, వామును అద్భుత ఔషధం!
ఎలక్ట్రానిక్ ఇన్సూరెన్స్ అకౌంట్ అంటే ఏంటి? ప్రయోజనం ఏమిటి?
ఎలక్ట్రానిక్ ఇన్సూరెన్స్ అకౌంట్ అంటే ఏంటి? ప్రయోజనం ఏమిటి?
ఈ ఐదువస్తువులు హనుమంతునికి సమర్పించండి అద్భుత ప్రయోజనాలు మీ సొంతం
ఈ ఐదువస్తువులు హనుమంతునికి సమర్పించండి అద్భుత ప్రయోజనాలు మీ సొంతం
రాజమౌళి రాసిన లెటర్‏ను ఫ్రేమ్ కట్టించిన డైరెక్టర్..
రాజమౌళి రాసిన లెటర్‏ను ఫ్రేమ్ కట్టించిన డైరెక్టర్..
రూ.43 వేల కోట్లు నష్టపోయిన ముఖేష్‌ అంబానీ.. కారణం ఏంటంటే..
రూ.43 వేల కోట్లు నష్టపోయిన ముఖేష్‌ అంబానీ.. కారణం ఏంటంటే..