Hyderabad: పాడుబడిన ఇంట్లో నుంచి వస్తోన్న దుర్వాసన.. అనుమానమొచ్చి వెళ్లి చూడగా దెబ్బకు భయంతో పరుగులు!

|

Feb 09, 2023 | 10:30 AM

హైదరాబాద్‌ శివారు ప్రాంతంలోని ఓ పాడుబడిన ఇంట్లో నుంచి దుర్వాసన రావడం మొదలైంది. స్థానికులు మొదటిగా ఈ విషయాన్ని..

Hyderabad: పాడుబడిన ఇంట్లో నుంచి వస్తోన్న దుర్వాసన.. అనుమానమొచ్చి వెళ్లి చూడగా దెబ్బకు భయంతో పరుగులు!
Representative Image
Follow us on

హైదరాబాద్‌ శివారు ప్రాంతంలోని ఓ పాడుబడిన ఇంట్లో నుంచి దుర్వాసన రావడం మొదలైంది. స్థానికులు మొదటిగా ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోకపోగా.. ఆ దుర్వాసన విపరీతంగా వస్తుండటంతో అనుమానం వచ్చి.. ఆ ఇంట్లోకి వెళ్లి చూశారు. అంతే! అక్కడ చూసిన ఊహించని సీన్‌కు బెంబేలెత్తిపోయి దెబ్బకు వెనక్కి పరుగులు పెట్టారు. ఇంతకీ అసలేం జరిగింది.? వాళ్లు ఏం చూశారో ఇప్పుడు తెలుసుకుందామా.?

వివరాల్లోకి వెళ్తే.. స్థానిక రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పిల్లర్ నెంబర్ 273 వద్ద సగం కాలిన మృతదేహం తీవ్ర కలకలం రేపింది. శివరాంపల్లి యూనివర్సిటీ వ్యూలో ఉన్న ఒక పాడుబడిన ఇంట్లో పూర్తిగా కాలిపోయి గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం ఒకటి లభ్యమైంది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అలాగే ఈ ఘటనపై కేసు నమోదు చేసి వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.