Telangana: రేపే తెలంగాణ బడ్జెట్‌… కేసీఆర్‌ ప్రభుత్వం కొత్త పథకాలను ప్రకటించనుందా.?

తెలంగాణ ప్రభుత్వం కొత్త బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఇప్పటికే కేబినెట్ ఆమోద ముద్ర వేసిన బడ్జెట్‌ను ప్రభుత్వం సోమవారం అసెంబ్లీలో ప్రకటించనుంది. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి ఇదే చివరి బడ్జెట్‌ కానుండడంతో అందరి దృష్టి పడింది. మరీ ఎన్నికల బడ్జెట్ ఎలా ఉండబోతోంది?

Telangana: రేపే తెలంగాణ బడ్జెట్‌... కేసీఆర్‌ ప్రభుత్వం కొత్త పథకాలను ప్రకటించనుందా.?
Ts Budget

Updated on: Feb 05, 2023 | 8:36 PM

తెలంగాణ ప్రభుత్వం కొత్త బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఇప్పటికే కేబినెట్ ఆమోద ముద్ర వేసిన బడ్జెట్‌ను ప్రభుత్వం సోమవారం అసెంబ్లీలో ప్రకటించనుంది. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి ఇదే చివరి బడ్జెట్‌ కానుండడంతో అందరి దృష్టి పడింది. మరీ ఎన్నికల బడ్జెట్ ఎలా ఉండబోతోంది? ఏయే రంగాలు ప్రాధాన్యం ఇస్తారు? కొత్త పథకాలు ఉంటాయా..? అన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 2023-24 వార్షిక బడ్జెట్ దాదాపు 3 లక్షల కోట్లు ఉండే అవకాశం ఉంది. ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టే పద్దు కావడంతో ప్రభుత్వం పెద్ద కసరత్తే చేసినట్లు తెలుస్తోంది..!

ముఖ్యంగా సంక్షేమ రంగానికి అధిక కేటాయింపులు ఉంటాయని తెలుస్తోంది. ఆదివారం ఉదయం ప్రగతిభవన్‌లో సమావేశమైన కేబినెట్‌…బడ్జెట్‌ను ఆమోదించింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణానికి బుణాలు తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. సమావేశాలకు మంత్రులు అందరు తప్పకుండా హాజరు కావాలిని కేసీఆర్‌ ఆదేశించారు.

రైతుబంధు, దళితబంధు, రుణమాపీ, ఉచిత విద్యుత్‌ వంటి పథకాలకు కేటాయింపులు ఎక్కువగా ఉంటాయని తెలుస్తోంది. వీటికే దాదాపు 50 వేల కోట్లకుపైగా ఇవ్వాలని ప్రతిపాదనలు అందాయి.. సాగునీరు, వ్యవసాయం, విద్యుత్ రంగాలకు భారీగానే నిధులు ఇవ్వాల్సి ఉంది. సొంత స్థలం ఉన్నవాళ్లు ఇళ్లు నిర్మించుకోవడం కోసం… రూ. 3 లక్షల ఆర్థిక సాయాన్ని కూడా చేరుస్తారని తెలుస్తోంది. నిరుద్యోగభృతి విషయంలో ఇప్పటికే ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి.. మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.

సోమవారం రేపు ఉదయం 10.30కు అసెంబ్లీలో ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు..శాసనమండలిలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బడ్జెట్ ప్రవేశపెడతారు. సాధారణంగా బడ్జెట్‌ సమావేశాలు మార్చ్‌లో పెడుతారు. కానీ ఈసారి మాత్రం ఫిబ్రవరి రెండో వారంలో సమావేశాలు ముగుస్తున్నాయి. అంటే బడ్జెట్‌ ఆమోదం పొందిన 47 రోజుల వరకూ పాత పద్దే అమల్లో ఉంటుంది. ఏప్రిల్‌-1 తర్వాత కొత్త బడ్జెట్ అమల్లోకి వస్తుంది. పద్దుల అధ్యయనం కోసం 7వ తేదీ సభకు సెలవు ఇచ్చారు. 8న బడ్జెట్‌ పద్దులపై చర్చఉంటుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..