KCR: కాంగ్రెస్‌ను బీజేపీ వాళ్లు బతకనిస్తారా..? రానున్న రోజులు మనవే.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు..

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 104 మంది బీఆర్‌ఎస్‌ MLAలు ఉన్నప్పుడే.. బీజేపీ వాళ్లు ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలు చేశారు.. 64 మంది MLAలు ఉన్న కాంగ్రెస్‌ను బతకనిస్తారా..? BRS నుంచికాంగ్రెస్‌లోకి వెళ్లినవాళ్లు బాధపడుతున్నారు.. అంటూ పేర్కొన్నారు. కాంగ్రెస్‌లో అంతా బీజేపీ కథ నడుస్తోందని..ఆ పార్టీలోకి వెళ్లిన ఓ సీనియర్ నేత వాపోయారన్నారు.

KCR: కాంగ్రెస్‌ను బీజేపీ వాళ్లు బతకనిస్తారా..? రానున్న రోజులు మనవే.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు..
BRS Chief KCR
Follow us

|

Updated on: Apr 18, 2024 | 8:18 PM

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 104 మంది బీఆర్‌ఎస్‌ MLAలు ఉన్నప్పుడే.. బీజేపీ వాళ్లు ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలు చేశారు.. 64 మంది MLAలు ఉన్న కాంగ్రెస్‌ను బతకనిస్తారా..? BRS నుంచికాంగ్రెస్‌లోకి వెళ్లినవాళ్లు బాధపడుతున్నారు.. అంటూ పేర్కొన్నారు. కాంగ్రెస్‌లో అంతా బీజేపీ కథ నడుస్తోందని..ఆ పార్టీలోకి వెళ్లిన ఓ సీనియర్ నేత వాపోయారన్నారు. 20 మంది ఎమ్మెల్యేలను తీసుకుని రమ్మంటారా అని.. సీనియర్‌ నేత నాతో అన్నారు, వద్దని తానే చెప్పానని కేసీఆర్ పేర్కొన్నారు. ఉద్యమ కాలంనాటి కేసీఆర్‌ను మళ్లీ చూస్తారు.. రానున్న రోజులు మనవే అంటూ కేసీఆర్‌ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

తెలంగాణ భ‌వ‌న్‌లో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కే చంద్రశేఖర్ రావు (కేసీఆర్) అధ్యక్షత‌న బీఆర్ఎస్ విస్తృత‌స్థాయి స‌మావేశం జరిగింది. ఈ స‌మావేశానికి ఎంపీ అభ్యర్థుల‌తో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, జడ్పీ చైర్మన్లు, పార్టీ కార్యవర్గ సభ్యులు, ముఖ్యనేతలు హాజ‌ర‌య్యారు. అభ్యర్థులకు బీఫామ్స్‌తోపాటు ప్రచార ఖర్చుల కింద ఒక్కొక్కరికీ 95లక్షల రూపాయల చెక్‌ను కేసీఆర్ అందించారు. ఈ క్రమంలో కేసీఆర్ పలు వ్యాఖ్యలు చేశారు.

కవిత అరెస్టుపై కేసీఆర్ ఏమన్నారంటే..?

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత అరెస్ట్‌పై కూడా కేసీఆర్‌ స్పందించారు. కవిత అరెస్ట్ ముమ్మాటికి అక్రమ అరెస్ట్‌ .. తప్పు చేసినట్టుగా ఆధారాలు చూపించలేదన్నారు. బీఎల్‌ సంతోష్‌పై కేసు పెట్టినందుకే కవిత ను జైలుకి పంపించారంటూ కేసీఆర్ చెప్పారు.

కేసీఆర్ బస్సు యాత్ర..

కాంగ్రెస్‌పై తీవ్ర వ్యతిరేకత వచ్చేసిందని.. రాబోయే రోజులు ముమ్మాటికీ మనవేనంటూ కేసీఆర్ నేతలతో పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో తామే గెలుస్తామని.. పార్లమెంట్‌లో మన గళం వినిపించాల్సిన అవసరం ఉందంటూ పేర్కొన్నారు. బస్సు యాత్ర రూట్ మ్యాప్ కూడా ఇవాళ ఖరారు చేస్తామని తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles