తెలంగాణ ఉభయ సభలు ఉదయం 10గంటలకు ప్రారంభమవుతాయి. కేంద్రం ప్రతిపాదించిన విద్యుత్ సవరణ బిల్లుపై ఉభయసభల్లో స్వల్ప కాలిక చర్చ జరుగుతుంది. సభ ప్రారంభం కాగానే విద్యుత్ బిల్లుపైనే చర్చిస్తారు. చర్చ ద్వారా రాష్ట్ర అభిప్రాయాన్ని కేంద్రానికి తెలియజేస్తుంది తెలంగాణ ప్రభుత్వం. అలాగే వివిధ శాఖలకు చెందిన ఏడు చట్ట సవరణ బిల్లులను శాసనసభలో ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. తెలంగాణ యూనివర్సిటీ కామన్ రిక్రూట్ మెంట్ బోర్డు బిల్లును సభలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రవేశపెడతారు. తెలంగాణ యూనివర్సిటీస్ కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డు బిల్లు సోమవారం అసెంబ్లీ ముందుకు రానున్నది. ఈ బిల్లును విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి సభలో ప్రవేశపెట్టనున్నారు. రాష్ట్రంలోని 15 వర్సిటీల్లో బోధన, బోధనేతర సిబ్బంది పోస్టుల భర్తీకి కామన్ బోర్డు ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం గతంలోనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు విద్యాశాఖ గతంలోనే జీవో సైతం జారీచేసింది. యూజీసీ నిబంధనలు అనుసరించే కామన్ బోర్డు పనిచేయనున్నది.
దీంతోపాటు.. ద యూనివర్సిటీ ఆఫ్ ఫారెస్ట్రీ తెలంగాణ, తెలంగాణ మోటార్ వెహికిల్స్ ట్యాక్సేషన్ చట్ట సవరణ, తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ చట్ట సవరణ, తెలంగాణ మునిసిపల్ చట్ట సవరణ, ది అజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా చట్ట సవరణ, తెలంగాణ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ చట్ట సవరణ బిల్లులను సభలో ప్రవేశపెడతారు.
అలాగే మున్సిపల్‌శాఖ చట్ట సవరణ, జీఎస్టీ, ఆజామాబాద్ ఇండ్రస్ట్రియల్ ఏరియా, వైద్య ఆరోగ్యశాఖ సవరణ, అటవీ యూనివర్సిటీ, తెలంగాణా మోటర్ వెహికల్స్ టాక్సేషన్ సవరణ బిల్లులను సభలో ప్రవేశ పెడతారు మంత్రులు.
కాగా.. ఈనెల 6న శాసనసభా సమావేశాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఆ రోజు కేవలం సంతాపాలకే సభ పరిమితమైంది. పది నిమిషాల్లోనే వాయిదా పడింది. సభా వాయిదా అనంతరం జరిగిన బిజినెస్ అడ్వయిజరీ కమిటీలో ఈనెల 12, 13 తేదీల్లో సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం