Big News Big Debate: కార్మిక, కర్షక వర్గాలు కోరుకుంటున్నదెంటి? సార్వత్రిక సమ్మెతో పాలకులు దిగొస్తారా?

|

Mar 28, 2022 | 9:51 PM

కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కార్మిక సంఘాలు ఉక్కు పిడికిలి బిగించాయి. వ్యవసాయ కూలీల నుంచి రక్షణ శాఖ ఉద్యోగుల వరకూ అంతా ఒక్కటై సమ్మెబాట పట్టారు. ఉవ్వెత్తున ఎగిసిన ఉద్యమ జ్వాలతో దేశం మరోసారి ఎరుపెక్కింది.

Big News Big Debate: కార్మిక, కర్షక వర్గాలు కోరుకుంటున్నదెంటి? సార్వత్రిక సమ్మెతో పాలకులు దిగొస్తారా?
Trade Unions Strike
Follow us on

Big News Big Debate:  కేంద్ర ప్రభుత్వం(Union Government) అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కార్మిక సంఘాలు(Trade Unions) ఉక్కు పిడికిలి బిగించాయి. వ్యవసాయ కూలీల నుంచి రక్షణ శాఖ ఉద్యోగుల వరకూ అంతా ఒక్కటై సమ్మెబాట పట్టారు. ఉవ్వెత్తున ఎగిసిన ఉద్యమ జ్వాలతో దేశం మరోసారి ఎరుపెక్కింది. ఎర్రదండు నినాదాలతో తెలుగురాష్ట్రాలూ ప్రతిధ్వనించాయి.

కేంద్రం వ్యవహరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశ వ్యాప్తంగా సార్వత్రిక సమ్మె కొనసాగుతోంది. కార్మిక చట్టాల్లో మార్పులు, ప్రైవేటీకరణ ప్రయత్నాలు సహా మొత్తం 12 డిమాండ్లతో సమ్మె చేపట్టారు. కోల్‌, స్టీల్‌, ఆయిల్‌, టెలికం, పోస్టల్‌ సహా అన్ని రంగాల్లోని ఉద్యోగులు సమ్మెకు మద్దతిచ్చారు. ప్రైవేటీకరణ లిస్టులో ఉన్న బ్యాంకింగ్‌, బీమా రంగాల కార్మికులు బంద్‌కు పిలుపు ఇచ్చారు. రైల్వే, రక్షణ శాఖల్లోని యూనియన్లు కూడా సమ్మెకు సంఘీభావం ప్రకటించాయి. కార్మిక, కర్షక ఉద్యోగులు ర్యాలీలు నిర్వహించారు. సమ్మెలో దాదాపు 20 కోట్ల మంది పాల్గొన్నారు. జాతీయస్థాయిలో జరుగుతున్న ఉద్యమాలకు లోకల్‌ ఫ్లేవర్‌ కూడా యాడ్‌ అయింది. కార్మికుల హర్తాల్‌తో సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. అటు విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బంద్ సక్సెస్‌ అయింది.

బంద్‌ను పలు రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. తమిళనాడు, కర్నాటక, హరియాణాలో ఎస్మా ప్రయోగిస్తామని వార్నింగ్‌ ఇచ్చాయి ప్రభుత్వాలు. ఇందుకు భిన్నంగా బెంగాల్‌, కేరళలో మాత్రం పాలకుల మద్దతుతో సంపూర్ణంగా జరుగుతోంది. తెలంగాణలో 80 లక్షల మంది ఉద్యోగ, కార్మికులు ఆందోళనల్లో పాల్గొన్నారు. ఇటీవల కాలంలో జరిగిన అతిపెద్ద ఉద్యమాల్లో ఒకటి సార్వత్రిక సమ్మె. లక్షలాదిగా కార్మికులు రోడ్లపై కనిపించారు. సంఘాలన్నీ ఏకతాటిపైకి వచ్చాయి. మరి వారి నినాదాలు పాలకుల చెవిన పడుతున్నాయా?

– బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ డెస్క్

ఈ అంశంపైనే టీవీ మేనేజింగ్ ఎడిటర్ రజినికాంత్ డిబేట్ నిర్వహించారు. ఆ లైవ్ వీడియో దిగువన చూడండి..