
ఎప్పుడో మార్చి-ఏప్రిల్‌లో వచ్చే యాన్యువల్ ఎగ్జామ్స్‌కి ఇప్పట్నుంచే ఎందుకు పుస్తకాలతో కుస్తీ.. అని లైట్ తీసుకుంటే అంతేసంగతులు. మధ్యలో నెలకోసారి యూనిట్‌టెస్టులు, క్వార్టర్లీ, హాఫియర్లీ అంటూ స్పీడ్‌బ్రేకర్లుంటాయి. మధ్యమధ్యలో పెర్ఫామెన్సుల్ని లెక్కగడతారు గనుక స్టూడెంట్స్‌కి పరీక్షలంటే ఆ మాత్రం భయమూ భక్తీ ఉంది.. ఉంటుంది. ప్రభుత్వాలు, పొలిటికల్ పార్టీలక్కూడా సేమ్ ఫార్ములా. తమతమ ప్రోగ్రెస్ రిపోర్ట్‌ల్ని ఎప్పటికప్పుడు ఎసెస్ చేసుకునే తీరాలి. అందుకోసమే ఉపఎన్నిక పేరుతో రాజ్యాంగం ప్రసాదించింది ఒక గోల్డెన్ ఛాన్స్. ఇప్పుడు తెలంగాణలో అటువంటి అగ్నిపరీక్షే ఒకటి రెడీగా ఉంది. ఉపఎన్నిక అనే మాట సూపర్‌గా ట్రెండింగ్‌లో ఉందిప్పుడు. ఉపఎన్నికల్లో ఏ పార్టీ స్ట్రైక్ రేట్ ఎంత? ఎన్నిసార్లు ఉపఎన్నిక రూలింగ్ పార్టీకి రెఫరెండమ్‌గా నిలిచింది? అని ఆరా తీస్తూ, గత జ్ఞాపకాల కోసం వెతుకుతూ సెర్చింజన్లను మోతెక్కిస్తున్నారు. పార్టీ ఆఫీసుల్లో కూడా అదే ఫికర్.. బైపోల్ ఫియర్. తెలంగాణలో స్టార్ ఆఫ్ ది డే ఎవరంటే.. మళ్లీ దానం నాగేందరే. అనర్హతకు గురై మిడిల్‌డ్రాప్ ఐన ఎమ్మెల్యేగా దానం పేరే ఇప్పుడు స్టేట్ మొత్తం రీసౌండ్ ఇస్తోంది. మొన్న హైకోర్టులో ఓడిపోవచ్చు. ఇవాళ సుప్రీంకోర్టులో ఓడిపోవచ్చు. రేపటిరోజున ఖైరతాబాద్‌లో మాత్రం గెలుపు నాదే..! అని బస్తీ మే సవాల్ కొడుతున్నారు తాజా...