అక్షరాలు రాయలేదని ఇంతటి శిక్షా? ఎల్‌కేజీ బాలుడిపై ఉపాధ్యాయురాలి పైశాచికత్వం..!

ఆదిలాబాద్‌లోని ఓ పాఠశాలలో దారుణం జరిగింది. అక్షరాలు రాయలేదని ఎల్‌కేజీ బాలుడిపై ఉపాధ్యాయురాలు అమానుషంగా దాడి చేసింది. ఎనిమిది నిమిషాల పాటు కర్రతో, చేతులతో చితకబాదిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ఈ ఘటన తల్లిదండ్రులు, స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. నిందిత టీచర్‌పై కఠిన చర్యలు, పాఠశాల యాజమాన్యంపై కేసు నమోదు చేయాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.

అక్షరాలు రాయలేదని ఇంతటి శిక్షా? ఎల్‌కేజీ బాలుడిపై ఉపాధ్యాయురాలి పైశాచికత్వం..!
Teacher Brutally Assaults

Edited By:

Updated on: Aug 29, 2026 | 10:43 AM

అక్షరాలు నేర్పాల్సిన టీచరే.. కసాయిగా మారింది.. ABCDలు రాయలేదని ఓ నాలుగేళ్ల బాలుడిపై ఎనిమిది నిమిషాల పాటు విచక్షణారహితంగా చితకబాదింది. చెంపలు, చెవి భాగం కమిలిపోయేలా దాడికి పాల్పడింది. ఈ దారుణ ఘటన ఆదిలాబాద్ జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసింది.

ఆదిలాబాద్ జిల్లా బోథ్‌లో దారుణం వెలుగుచూసింది. ఏబీసీడీలు రాయడం లేదని ఓ నాలుగేళ్ల పసివాడిపై ఓ టీచర్ పాశవికత్వం ప్రదర్శించింది. తప్పులు రాస్తున్నాడన్న కోపంతో విచక్షణ కోల్పోయి.. చేతితో, కర్రతో చిన్నారిని చితకబాదింది. ఏకంగా ఎనిమిది నిమిషాల పాటు ఆగకుండా కొట్టిన ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు వెలుగులోకి రావడంతో తల్లిదండ్రులు, స్థానికులు షాక్ కు గురయ్యారు. టీచర్ ను అరెస్ట్ చేయాలని.. స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు.

అసలేం జరిగిందంటే.. బోథ్ మండలం కుచులాపూర్‌లోని వేదం పాఠశాలలో కుచులాపూర్ గ్రామానికి చెందిన విద్యార్థి ముస్కు రుద్వే దొడ్డి(4) నర్సరీ చదువుతున్నాడు. గురువారం (ఆగస్టు 27) పాఠశాల తరగతి గదిలో అక్షరాలు దిద్దిస్తున్న క్రమంలో ఓ ఉపాధ్యాయురాలు అతన్ని చితకబాదింది. బాలుడు ఇంటికి వెళ్లిన అనంతరం చెవులు, చెంపలు, వీపు, తొడ భాగం ఎరుపెక్కి ఉండటంతో కుటుంబ సభ్యులు పాఠశాలకు వచ్చి యాజమాన్యాన్ని నిలదీశారు. పొంతన లేని‌ సమాదానాలు చెప్పడంతో సీసీ కెమెరాలు పరిశీలించారు. ఆ సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలు‌చూసి తల్లిదండ్రులు స్థానికులు షాక్ అయ్యారు.

అంతే.. తల్లిదండ్రులు, బంధువుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. పసివాడిపై టీచర్ విచక్షణారహితంగా దాడి చేస్తున్న దృశ్యాలు కెమెరాలో స్పష్టంగా రికార్డయ్యాయి. చేతితో కొట్టడం.. కర్రతో దాడి చేయడం.. ఇలా నిమిషాల తరబడి బాలుడిపై దాడి చేసినట్లు దృశ్యాల్లో కనిపించినట్లు తల్లిదండ్రులు చెబుతున్నారు. ఈ విషయంపై ఎంఈవో మహమ్మద్ హుస్సేన్ వివరణ ఇస్తూ… విచారణ చేసి డీఈవోకు పూర్తి వివరాలు అందజేస్తామన్నారు. ఉపాధ్యాయురాలు సింధూజ, పాఠశాలపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఎస్సై పురుషోత్తం తెలిపారు.

అక్షరాలు రాయలేదని ఇంతటి శిక్షా?

నాలుగేళ్ల చిన్నారిని ఇంత దారుణంగా కొట్టే హక్కు ఎవరిచ్చారు.. అంటూ తల్లిదండ్రులు, స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనపై బాలుడి తల్లిదండ్రులు సీసీటీవీ దృశ్యాలతో బోథ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. చిన్నారిపై దాడికి పాల్పడిన టీచర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని.. ఘటనను అడ్డుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన పాఠశాల యాజమాన్యంపైనా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అక్షరాల లోకంలోకి అడుగుపెట్టాల్సిన పసివాడికి.. పాఠశాలలోనే హింస ఎదురైంది. గురువుగా మారాల్సిన చేతులు.. కర్ర పట్టి పసి ప్రాణాన్ని గాయపరిచాయన్న ఆరోపణలు ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us