Telangana: కాంగ్రెస్ గెలిచింది.. అక్కడి జనాలకు డెడ్ చీప్‌గా చికెన్ దక్కింది

రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఖమ్మం జిల్లాకు చెందిన ఓ చికెన్‌ షాప్‌ యజమాని తనదైన శైలిలో కాంగ్రెస్‌ విక్టరినీ సెలబ్రేట్ చేసుకున్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఘన విజయాన్ని పురస్కరించుకొని కస్టమర్లకు డిస్కౌంట్ ధరకు చికెన్‌ను అందించాడు. వివరాల్లోకి వెళితే..

Telangana: కాంగ్రెస్ గెలిచింది.. అక్కడి జనాలకు డెడ్ చీప్‌గా చికెన్ దక్కింది
Congress Party

Updated on: Dec 07, 2023 | 10:49 AM

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గ్రాండ్‌ విక్టరీ కొట్టింది. ఎన్నికల ఫలితాలు వచ్చేశాయ్‌. తెలంగాణలో తొలిసారి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. ముందునుంచి అనుకున్నట్లుగానే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి వైపే అధిష్టానం మొగ్గుచూపింది. ఇదిలా ఉంటే కాంగ్రెస్‌ పార్టీ గెలుపుపై కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఖమ్మం జిల్లాకు చెందిన ఓ చికెన్‌ షాప్‌ యజమాని తనదైన శైలిలో కాంగ్రెస్‌ విక్టరినీ సెలబ్రేట్ చేసుకున్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఘన విజయాన్ని పురస్కరించుకొని కస్టమర్లకు డిస్కౌంట్ ధరకు చికెన్‌ను అందించాడు. వివరాల్లోకి వెళితే.. ఖమ్మంలోని కరైగూడెనాకి చెందిన రాఘవ రావు చికెన్‌ షాప్‌ను నడిపిస్తున్నాడు.

మొదటి నుంచి కాంగ్రెస్‌కు వీరాభిమాని అయిన రాఘవ రావు.. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం సాధించడంతో వినూత్న నిర్ణయం తీసుకున్నాడు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకరణం చేస్తున్న సందర్భంగా డిస్కౌంట్‌ ధరకు చికెన్‌ను అందించాడు. మంగళ, బుధవారాల్లో కిలో చికెన్‌ను రూ. 120కే అందించాడు. ప్రస్తుతం మార్కెట్లో కిలో చికెన్‌ రూ. 160 పలుకుతోంది. ఈ ఆఫర్‌తో ఏకంగా నాలుగు క్వింటాళ్ల చికెన్‌ను విక్రయించాడు. ఇదిలా ఉంటే ఖమ్మం జిల్లా నుంచి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌ రావు, మట్ట రంగమణి విజయం సాధించిన విషయం తెలిసిందే.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..