భాగ్యనగరంలో వెలుగుచూసిన సరికొత్త మోసం.. కేన్సర్ పేరుతో రూ.6 కోట్ల స్వాహా.. దంపతులపై కేసు!

మానవత్వాన్ని ఆసరాగా చేసుకుని భారీ మోసానికి పాల్పడ్డారనే ఆరోపణలు హైదరాబాద్‌లో కలకలం రేపుతున్నాయి. క్యాన్సర్ చికిత్స పేరుతో ఓ బిల్డర్ నుంచి రూ.6 కోట్లు తీసుకున్నారు. అంతేకాదు ఆ డబ్బులతో ఆస్తులు కొనుగోలు చేశారు. దీంతో అసలు విషయం బయటపడటంతో దంపతులపై మధురానగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. దీంతో పోలీసులు విచారణ చేపట్టారు.

భాగ్యనగరంలో వెలుగుచూసిన సరికొత్త మోసం.. కేన్సర్ పేరుతో రూ.6 కోట్ల స్వాహా.. దంపతులపై కేసు!
Fraud Under Cancer Treatment
Image Credit source: AI Image

Updated on: Jul 09, 2026 | 1:02 PM

మానవత్వాన్ని ఆసరాగా చేసుకుని భారీ మోసానికి పాల్పడ్డారనే ఆరోపణలు హైదరాబాద్‌లో కలకలం రేపుతున్నాయి. క్యాన్సర్ చికిత్స పేరుతో ఓ బిల్డర్ నుంచి రూ.6 కోట్లు తీసుకున్నారు. అంతేకాదు ఆ డబ్బులతో ఆస్తులు కొనుగోలు చేశారు. దీంతో అసలు విషయం బయటపడటంతో దంపతులపై మధురానగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. దీంతో పోలీసులు విచారణ చేపట్టారు.

పోలీసుల వివరాల ప్రకారం, వాసిరెడ్డి స్వాతి, ఆమె భర్త సుజీత్‌పై మల్లి రామకృష్ణారెడ్డి అనే బిల్డర్ ఫిర్యాదు చేశారు. స్వాతికి క్యాన్సర్ వ్యాధి ఉందని నమ్మించి, అత్యవసర చికిత్స కోసం డబ్బులు వసూలు చేశాడు. తన వద్ద నుంచి భారీ మొత్తంలో నగదు తీసుకున్నారని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నారు. డబ్బులు అందజేస్తే తిరిగి చెల్లిస్తామని, లేకపోతే సమాన విలువైన బంగారం లేదా భూమి ఇస్తామని దంపతులు హామీ ఇచ్చినట్లు తెలిపారు. అయితే డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగిన సమయంలో బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. సూసైడ్ నోట్ రాసి కుటుంబ సభ్యులపై తప్పుడు కేసులు పెడతామని హెచ్చరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

అంతేకాకుండా తీసుకున్న రూ.6 కోట్లతో భూములు, బంగారం, కారు, ఇతర ఆస్తులు కొనుగోలు చేసి వాటిని కుటుంబ సభ్యుల పేర్లపై రిజిస్టర్ చేశారని ఆరోపించారు. సుజీత్ ఓ ప్రముఖ గోల్డ్ షాప్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్నట్లు సమాచారం. ఫిర్యాదు ఆధారంగా మధురానగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. డబ్బుల లావాదేవీలు, ఆస్తుల కొనుగోళ్లు, ఆరోపణల్లో వాస్తవాలపై పోలీసులు అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us