
ప్రేమకు మరణం లేదని అంటారు. ఈ మాటను అక్షరాలా నిజం చేశారు పెద్దపల్లి జిల్లా అల్లిపూర్ గ్రామానికి చెందిన బాలసాని మల్లయ్య. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం అల్లిపూర్ గ్రామానికి చెందిన బాలసాని మల్లయ్య, రాజమ్మ దంపతులు. వీరికి సంతానం కలగలేదు. కాగా, 23 సంవత్సరాల క్రితం మల్లయ్య భార్య రాజమ్మ అనారోగ్య కారణంగా చనిపోయింది. పెద్దగా ఆస్తి,పాస్తులు లేకున్నా కూడా తన భార్య సమాధి పక్కనే బతికుండగానే తన సమాధి కూడా నిర్మించుకున్నాడు మల్లయ్య. అనాథగా మారిన మల్లయ్యను గ్రామంలోని గౌడ గీత కార్మికులు ఎంతో కాలం పోషించారు.
గత కొద్ది రోజుల క్రితం సుల్తానాబాద్ కు చెందిన రిటైర్డ్ టీచర్లు అల్లం సత్యనారాయణ భాగ్యలక్ష్మి దంపతులు నెలకు రూ.1000 చొప్పున అతనికి ఆర్థిక సహాయం చేస్తున్నారు. ఈ క్రమంలో మల్లయ్య అనారోగ్య కారణంగా మృతి చెందాడు. దీంతో సర్పంచ్ కోదాటి సాయికిరణ్, పాలకవర్గం అలాగే గౌడ సామాజిక వర్గం కలిసి మల్లయ్య అంత్యక్రియలు ఘనంగా నిర్వహించారు. స్మశాన వాటికలో తాను ఏర్పాటు చేసుకున్న తన భార్య పక్కన ఉన్న సమాధిలోనే తన అంత్యక్రియలు నిర్వహించి, పెద్ద మనసు చాటుకున్నారు గ్రామస్తులు.
పూటకు ముద్దలేకున్నా కూడా తన భార్య సమాధి పక్కనే తన సమాధిని ముందస్తుగా నిర్మించుకున్న మల్లయ్య చనిపోవడంతో గ్రామస్తులు శోకసముద్రంలో మునిగిపోయారు గ్రామస్తులు, తన అంత్యక్రియలను ఘనంగా నిర్వహించి, మల్లయ్య ఆత్మకు శాంతి కలగాలని వేడుకున్నారు గ్రామస్తులు. స్థానికులే..అంత్యక్రియలు నిర్వహించారు..
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..