
కింద పడకుండానే నడక నేర్చుకున్నదెవరు? సంక్షోభాలు చూడకుండా పార్టీలు నడిపిందెవరు? గెలుపోటముల రుచి చూడకుండా అధికారపీఠంపై కూర్చున్నదెవరు? ప్రతి పార్టీ ఎదుర్కొన్న, ఎదుర్కొంటున్న పోరాటమే ఇది. బీఆర్ఎస్ కూడా దానికి అతీతం కాదంతే. పార్టీ నుంచి నాయకులు వెళ్లిపోవడం వేరు. పార్టీ నుంచి నాయకులను సస్పెండ్ చేయడం వేరు. కాని, సొంత కుటుంబ సభ్యులనే పార్టీ నుంచి బయటకు పంపించడమే కాస్త వేరు. కచ్చితంగా బీఆర్ఎస్‌కు ఇది సంక్షోభ కాలమే. అసలెక్కడ మొదలైంది ఈ డౌన్‌ఫాల్? దాని వెనక కారణాలను బీఆర్ఎస్ విశ్లేషించుకుందా? తెలంగాణ అంటే టీఆర్ఎస్… టీఆర్ఎస్ అంటే తెలంగాణ. ఇలా ప్రజలు అనుకుంటున్నారని 2023 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చే వరకూ అలాగే అనుకుంది పార్టీ. కాని, కథను అంతకు ఏడాది ముందే మార్చేశారని తెలుసుకోలేకపోయారు. 2022 అక్టోబర్ 5న తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితిగా మారింది. అప్పటి నుంచి పార్టీని ఓన్ చేసుకోలేకపోయారో, ఆల్రడీ గూడుకట్టుకుని ఉన్న అసంతృప్తో గానీ.. సరిగ్గా ఏడాది తరువాత జరిగిన ఎన్నికల్లో ఓడిపోయింది పార్టీ. సాక్షాత్తు సీఎం స్థానంలో ఉన్నప్పుడే.. కామారెడ్డి స్థానం నుంచి ఓడిపోయారు కేసీఆర్. అప్పటి వరకు తెలంగాణ ప్రజలకు పెద్దగా తెలియని నాయకుని చేతిలో పరాజయం పాలయ్యారు. అక్కడున్నది లోకల్‌గా పేరున్న లీడరే కావొచ్చు. బట్.. కేసీఆర్ కంటే గొప్పనా? అక్కడి నుంచి కనిపించడం మొదలుపెట్టింది డౌన్‌ఫాల్. ఎన్నికల ఫలితాలప్పుడే కామారెడ్డిలో కేసీఆర్ ఓటమి. ఆ తరువాత...