Telangana: స్నేహితుడ్ని నమ్మి వచ్చిన అమ్మాయి.. చివరికి ఊహించని షాక్

|

Jul 04, 2023 | 6:38 AM

మిత్రుడ్ని నమ్మి వచ్చినందుకు వచ్చిన ఓ అమ్మాయిని అత్యాచారం చేయడం కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే హనమకొండలోని ఓ డిగ్రీ కళాశాలలకు చెందిన ఏడుగురు స్నేహితులు తమ బైక్‌లపై ములుగు జిల్లాలోని వాజేడు పర్యటనకు వెళ్లారు. అక్కడ వీరందరు చాలా సరదగా గడిపారు.

Telangana: స్నేహితుడ్ని నమ్మి వచ్చిన అమ్మాయి.. చివరికి ఊహించని షాక్
Rape case
Follow us on

మిత్రుడ్ని నమ్మి వచ్చినందుకు వచ్చిన ఓ అమ్మాయిని అత్యాచారం చేయడం కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే హనమకొండలోని ఓ డిగ్రీ కళాశాలలకు చెందిన ఏడుగురు స్నేహితులు తమ బైక్‌లపై ములుగు జిల్లాలోని వాజేడు పర్యటనకు వెళ్లారు. అక్కడ వీరందరు చాలా సరదగా గడిపారు. ఆ తర్వాత సాయంత్రం పూట తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలోనే ఓ అమ్మాయిపై మరో అబ్బాయి కన్నేశాడు. వాళ్లు ప్రయాణం చేస్తుండగా రింగు రోడ్డు మీదుగా హనుమకొండ జిల్లా కోమటిపల్లికి చేరుకున్నారు. అయితే అక్కడ కాసేపు విశ్రాంతి కోసం ఆగారు.

ఈ క్రమంలోనే వరంగల్‌కు చెందిన అమ్మాయిని ఏటూనాగారానికి చెందిన అన్వేష్ అనే అబ్బాయి కొంచెం పనుందని చెప్పి ఆమెను పిలిచాడు. ఆ తర్వాత ఆమెను రింగు రోడ్డుకు కాస్త దూరంగా తీసుకెళ్లాడు. చివరికి ఆమెపై అత్యాచారం చేశాడు. ఆ తర్వాత బైక్‌పై పారిపోయాడు. విషయం తెలుసుకున్న మిగతా మిత్రులకు ఈ విషయం తెలిసింది. ఇక ఆమెను వరంగల్‌లోని తన ఇంటికి తీసుకెల్లారు. దీంతో ఆమె తల్లదండ్రులు సోమవారం నాడు కేయూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నిందితునిపై కేసు నమోదు చేసి గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం

ఇవి కూడా చదవండి