Telangana: ఆ చిట్టి నవ్వును గుండెపోటు చిదిమేసింది.. దేవుడా ఉక్కులు ఏం పాపం చేసిందని

|

Oct 16, 2024 | 4:06 PM

హార్ట్ ఎటాక్.. ఇప్పుడు మనిషిని తీవ్రంగా వెంటాడుతోన్న భయం ఇది. ఒకప్పుడు 60 ఏళ్లు పైబడిన వారు గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయేవారు. కానీ గత కొంత కాలంగా చిన్నా పెద్దా అనే తేడా లేకుండా.. అటాక్ చేస్తోంది. అప్పటిదాకా.. ఆడుతూ.. పాడుతూ.. నవ్వుతూ.. నడుస్తూ.. ఉంటారు.. సడెన్‌గా కుప్పకూలిపోయి ప్రాణాలు విడుస్తున్నారు. తాజాగా ఐదేళ్ల చిన్నారి గుండెపోటుతో మరణించడం విస్మయాన్ని కలిగిస్తోంది.

Telangana: ఆ చిట్టి నవ్వును గుండెపోటు చిదిమేసింది.. దేవుడా ఉక్కులు ఏం పాపం చేసిందని
Baby Dies
Follow us on

ఆకస్మికంగా ఆగిపోతున్న గుండె… అరక్షణంలోనే ముగుస్తున్న ఆయుష్షు…! ఎందుకిలా… గుండెపోట్లతో గుండె బేజారవుతోంది. వయసుతో నిమిత్తం లేకుండా క్షణాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు.  ఒకప్పుడు 60 ఏళ్లు పైబడ్డవారికే గుండెపోటు గండం. కానీ… ఇప్పుడు గుండెపోటుకు వయసు తేడాల్లేవు. చిన్నా పెద్దా తారతమ్యం లేదు. అప్పటిదాకా ఆడుతూ పాడుతూ.. ఉల్లాసంగా కనిపించినవాళ్లు సడెన్‌గా కుప్పకూలిపోతారు. ఇక సెలవంటూ వెళ్లిపోతున్నారు. తాజాగా ఐదేళ్ల చిన్నారి గుండెపోటుతో చనిపోవడం విస్మయాన్ని కలిగిస్తోంది. అప్పటివరకూ కళ్లెదుటే ఆడుకున్న పాపాయి అకస్మాత్తుగా విగతజీవిగా మారిపోవడంతో..  కుటుంబసభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు.

కరీంనగర్‌ జిల్లా జమ్మికుంటకు చెందిన రాజు-జమున దంపతులకు 5 ఏళ్ల పాప ఉంది. తన పేరు ఉక్కులు. ముద్దు ముద్దు మాటలు మాట్లడే తనంటే.. కుటుంబ సభ్యులకు ఎంతో ఇష్టం. ఇరుగుపొరుగువారు కూడా పాపను బాగా ముద్దు చేస్తారు. మంగళవారం ఉదయం నిద్రలేచి పాప.. కాసేపు ఆడుకుంది. ఆ తర్వాత అమ్మ వద్దకు వచ్చి తనకు కళ్లు తిరుగుతున్నాయని చెప్పింది. దీంతో పాపను తల్లి స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లింది. అక్కడ బాలికను పరీక్షించిన డాక్టర్లు.. పరిస్థితి ఆందోళనకరంగా ఉందని హన్మకొండ పెద్ద ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. దీంతో వెంటనే పాపను హన్మకొండకు తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్లు పరీక్షిస్తుండగానే బాలిక మృతి చెందింది. కాగా, పాపకు గుండె సంబంధిత సమస్యలు ఉన్నాయని.. ఆ విషయాన్ని తల్లిదండ్రులు గుర్తించలేకపోయారని డాక్టర్లు తెలిపారు. అందువల్లే గుండెపోటు వచ్చి ఉంటుందని అనుమానం వ్యక్తపరిచారు. ఎంతో ప్రేమగా పెంచుకున్నబిడ్డ మరణవార్త వినగానే ఆ తల్లిదండ్రుల ఆవేదన అంతా ఇంతా కాదు. గుండెపోటుతో చిన్నారి మృతిచెందిందని తెలియడంతో గ్రామంలో కూడా విషాదఛాయలు అలుముకున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..