కడుపు నొప్పితో ఆసుపత్రికి వెళ్లిన బాలిక.. స్కానింగ్ చేయగా డాక్టర్లు షాక్..

ఎవరికైనా ఆకలి వేస్తే వారి ఆహారపు అలవాట్లను అనుసరించి అన్నం, చపాతీ , పండ్లు ఇలా ఏది నచ్చితే అది తింటారు. అయితే ఓ బాలిక మాత్రం..

కడుపు నొప్పితో ఆసుపత్రికి వెళ్లిన బాలిక.. స్కానింగ్ చేయగా డాక్టర్లు షాక్..
Stomach
Ravi Kiran

|

Jun 12, 2021 | 1:12 PM

ఎవరికైనా ఆకలి వేస్తే వారి ఆహారపు అలవాట్లను అనుసరించి అన్నం, చపాతీ , పండ్లు ఇలా ఏది నచ్చితే అది తింటారు. అయితే ఓ బాలిక మాత్రం తాను అందరికంటే డిఫరెంట్.. నా రూటే సెపరేట్ అంటూ వెంట్రుకలను తినేసింది. తీరా నడుపు నొప్పితో ఆస్పత్రిలో చేరిన బాలికకు.. సక్సెస్‌ ఫుల్‌గా ఆపరేషన్‌ను చేశారు వైద్యులు.

ఈ అమ్మాయి వయసు 17 ఏళ్ల. గత 5 నెలలుగా ఆహారంతో తన తానే తినేసింది. అయితే మానసిక సమస్యతో బాధపడుతున్న ఆ అమ్మాయి అప్పుడప్పుడూ తన వెంట్రుకలు తానే లాక్కుని తినేదని వైద్యులకు వివరించారు అమ్మాయి కుటుంబసభ్యులు. ఈ మధ్య కాలంలో ఆ అమ్మాయికి తరుచు కడుపు నొప్పి, వాంతులు చేసుకుంటుండటంతో మే 31న ఆస్పత్రిలో చేర్పించారు. అల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌ తీయగా, కడుపులో వెంట్రుకలు ఉండలా పేరుకుపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు.

రెండు గంటల పాటు శ్రమించి, ఆమెకు శస్త్రచికిత్సను నిర్వహించారు ఉస్మానియా వైద్యులు.పెద్దపేగు, చిన్నపేగులో 120 సెంటమీటర్ల పొడవు, 2 కేజీల బరువు ఉన్న వెంట్రుకలతో కూడిన ఉండను తొలగించారు డాక్టర్లు. అయితే నెల క్రితమే శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించగా.. బాలిక కొవిడ్‌ బారినపడటంతో వాయిదా వేశారు.

Also Read:

ఖడ్గమృగంపై దాడికి పులి యత్నం.. అంతలోనే ఊహించని ట్విస్ట్.. బెంగాల్ టైగర్ పరుగో పరుగు.!

అక్కడి పండ్లు తిన్నారో బీమారీ గ్యారంటీ.! కొనాలంటేనే భయపడుతున్న ప్రజలు.!!

ఒకే కాన్పులో 10 మందికి జన్మనిచ్చిన మహిళ.? అసలు నిజమెంత.! వెలుగులోకి కొత్త ట్విస్ట్..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu