AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఇంతకాలం టైంపాస్‌కి లవ్ చేశావా..? అమ్మాయి చెప్పిన ఆ ఒక్క మాటతో..

ప్రేమ ఊపిరి పోస్తుంది అనుకుంటే అతడి ఊపిరి తీసింది. ఓయూలో ఓ విద్యార్థి పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఇది గమనించిన విద్యార్థులు అతడిని ఆస్పత్రికి తరలించినా.. లాభం లేకుండా పోయింది. యువతి అన్న ఆ ఒక్క మాటతో కుంగిపోయిన యువకుడు ఈ కఠిన నిర్ణయం తీసుకున్నాడు. అసలు ఏం జరిగింది..? అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Telangana: ఇంతకాలం టైంపాస్‌కి లవ్ చేశావా..? అమ్మాయి చెప్పిన ఆ ఒక్క మాటతో..
Ou Engineering Student Dies
Sravan Kumar B
| Edited By: |

Updated on: Apr 28, 2026 | 4:32 PM

Share

విద్యాకుసుమాలు వికసించాల్సిన ఓయూ క్యాంపస్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రేమించిన యువతి దూరం పెట్టిందన్న మనస్థాపంతో ఓ ఇంజనీరింగ్ విద్యార్థి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గాంధీ ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడి చికిత్స పొందుతూ చివరకు ప్రాణాలు విడిచాడు. మహబూబాబాద్ జిల్లాకు చెందిన 19 ఏళ్ల యువకుడు ఉస్మానియా యూనివర్సిటీలో మైనింగ్ ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. క్యాంపస్‌లోని లేడీస్ హాస్టల్ సమీపంలో ఒక్కసారిగా ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఇది గమనించిన తోటి విద్యార్థులు, సిబ్బంది వెంటనే మంటలను ఆర్పి గాంధీ ఆసుపత్రికి తరలించారు. సుమారు 70 శాతం పైగా కాలిన గాయాలతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న అతడు, వైద్యులు శ్రమించినప్పటికీ మృతి చెందాడు.

సూసైడ్ నోట్‌లో సంచలన విషయాలు

ఘటనా స్థలంలో పోలీసులకు లభించిన సూసైడ్ నోట్ ఈ ఆత్మహత్యకు గల కారణాలను వెల్లడించింది. తాను సాహితి అనే యువతిని గాఢంగా ప్రేమించానని, అయితే ఆమె తనను మోసం చేసిందని బాధితుడు లేఖలో ఆవేదన వ్యక్తం చేశాడు. తన ప్రియురాలికి ఒక అబ్బాయిని పరిచయం చేయగా, ఆ అబ్బాయి తన గురించి చెడుగా చెప్పడంతో ఆమె బ్రేకప్ చెప్పిందని అందులో రాశాడు. గతంలోనే ఒకసారి ఆత్మహత్యాయత్నం చేసిన ఈ యువకుడు, తిరిగి హైదరాబాద్ వచ్చిన తర్వాత ఆ యువతి వేరే వ్యక్తితో ప్రేమలో ఉన్నట్లు తెలుసుకున్నాడు. ఇదే విషయంపై ఆమెను నిలదీయగా.. ‘‘నిన్ను టైంపాస్ కోసం ప్రేమించాను’’ అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో తీవ్ర డిప్రెషన్‌కు లోనైనట్లు లేఖలో వివరించాడు.

కుటుంబంలో నిండిన విషాదం

ఉన్నత చదువులు చదివి ప్రయోజకుడవుతాడని ఆశించిన కొడుకు, ప్రేమ పేరుతో ఇలా తనువు చాలించడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఒక చిన్న మాటకో లేదా ప్రేమ విఫలమైందన్న కారణంతోనో ఇలాంటి క్షణికావేశ నిర్ణయాలు తీసుకోవద్దని పోలీసులు మరియు కౌన్సిలింగ్ నిపుణులు విద్యార్థులకు సూచిస్తున్నారు. ఈ ఘటనపై ఓయూ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు