జీహెచ్ఎంసీ అధికారులపై పోలీసులకు 11 ఏళ్ల బాలిక ఫిర్యాదు.. ఇంతకీ ఏం జరిగిందంటే..

శేరిలింగంపల్లి జీహెచ్‌ఎంసీ అధికారులపై శాహెర్ అనే 11 ఏళ్ల బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది.

జీహెచ్ఎంసీ అధికారులపై పోలీసులకు 11 ఏళ్ల బాలిక ఫిర్యాదు.. ఇంతకీ ఏం జరిగిందంటే..
Complaint

Updated on: Mar 12, 2022 | 10:02 PM

శేరిలింగంపల్లి జీహెచ్‌ఎంసీ అధికారులపై శాహెర్ అనే 11 ఏళ్ల బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. రహదారి ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ పోలీసులు ఇచ్చిన సూచనను శేరిలింగంపల్లి అధికారులు పెడచెవిని పెట్టరని శాహెర్ పేర్కొంది. నాలుగు నెలలు అవుతున్నా రహదారి మరమ్మతులు చేయలేదంటూ తన ఫిర్యాదులో పేర్కొంది. దీనివల్ల ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని.. వెంటనే శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్‌తో పాటు సర్కిల్ 20 ఈఈపైన కేసు నమోదు చేయాలని మాదాపూర్ డీసీపీకి శాహెర్ ఫిర్యాదు చేశారు.

Loading...
Unable to load recommendations.
Follow Us