తెలంగాణ ఓటర్లను ఏపీలో కలిపారు: టీడీపీ

విజయవాడ: తెలంగాణ ఓటర్లను ఏపీలో కలిపారంటూ కృష్ణా జిల్లా వీరులపాడు ఎమ్మార్వో కార్యాలయం ముందు స్థానిక టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ సరికొత్త వివాదాలు తెరపైకి వస్తున్నాయి. తెలంగాణకు కృష్ణా జిల్లా ఆనుకుని ఉంటుంది. ఈ జిల్లాలోని వీరులపాడు మండలం, పెద్దాపురం గ్రామాల్లో తెలంగాణ సహా ఇతర ప్రాంతాలకు చెందిన వారి ఓట్లను చేర్చారంటూ టీడీపీ నేతలు అంటున్నారు. కార్యకర్తలు వీరులపాడు తహశీల్దార్ కార్యాలయం ఎదుట నేడు ఆందోళనకు చేపట్టారు. ఆ […]

తెలంగాణ ఓటర్లను ఏపీలో కలిపారు: టీడీపీ
Follow us

|

Updated on: Mar 07, 2019 | 6:27 PM

విజయవాడ: తెలంగాణ ఓటర్లను ఏపీలో కలిపారంటూ కృష్ణా జిల్లా వీరులపాడు ఎమ్మార్వో కార్యాలయం ముందు స్థానిక టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ సరికొత్త వివాదాలు తెరపైకి వస్తున్నాయి. తెలంగాణకు కృష్ణా జిల్లా ఆనుకుని ఉంటుంది. ఈ జిల్లాలోని వీరులపాడు మండలం, పెద్దాపురం గ్రామాల్లో తెలంగాణ సహా ఇతర ప్రాంతాలకు చెందిన వారి ఓట్లను చేర్చారంటూ టీడీపీ నేతలు అంటున్నారు. కార్యకర్తలు వీరులపాడు తహశీల్దార్ కార్యాలయం ఎదుట నేడు ఆందోళనకు చేపట్టారు.

ఆ కలపబడ్డ వారంతా వైసీపీ సానుభూతిపరులని వారు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు ఎమ్మార్వోకి ఫిర్యాదు చేశారు. తెలంగాణ ఆధార్ కార్డు ఉండగా.. ఏపీ ఓటర్ల జాబితాలో ఎలా పేర్లను నమోదు చేశారని అధికార్లను నిలదీశారు. దీనిపై దర్యాప్తు చేసి చర్య తీసుకుంటామని ఎమ్మార్వో హామీ ఇవ్వడంతో ఆందోళనను టీడీపీ నాయకులు విరమించారు.