కోర్టు ధిక్కరణ.. ఐఏఎస్ అధికారికి నెలరోజుల జైలు శిక్ష

కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఐఏఎస్ అధికారి, కరీంనగర్ నగరపాలన సంస్థ మాజీ కమిషనర్ కె. శశాంక్‌కు నెల రోజుల శిక్ష విధిస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పునిచ్చింది. దీంతో పాటు రూ.25వేల జరిమానా కూడా విధించింది. దీనిపై అప్పీలు చేసుకునేందుకు వీలుగా శిక్ష అమలును ఆరు వారాల పాటు నిలిపివేస్తున్నట్లు జస్టిస్ ఎ. రాజశేఖర్ తీర్పును ఇచ్చారు.

అయితే కరీంనగర్‌లో 1980లలో మునిసిపాలిటీ నుంచి అనుమతి తీసుకొని కొంతమంది నివాస భవనాలు, షాపులు నిర్మించుకున్నారు. ఆ తరువాత నగర విస్తరణలో భాగంగా వారికి నోటీసులు ఇవ్వకుండానే నివాస భవనాలను, షాపులను అధికారులు కూల్చివేశారు. దీనిపై కేసు వేస్తూ ఓ పిటిషనర్ కోర్టును ఆశ్రయించారు. దీనిపై గతంలో స్టే ఆదేశాలను ఇచ్చిన హైకోర్టు, ఆపై విచారించి, పిటషనర్ కోల్పోయిన 13 షాపులను తిరిగి కేటాయించాలని లేదా నిబంధనల ప్రకారం నష్ట పరిహారం ఇవ్వాలని 2015 జనవరిలో ఆదేశాలను ఇచ్చింది. కానీ కోర్టు ఆదేశాలను అధికారులు పాటించకపోవడంతో పిటిషనర్ మరోసారి కోర్టును ఆశ్రయించారు. దీన్ని విచారించిన న్యాయమూర్తి కార్పోరేషన్ అధికారుల తీరుని తప్పుబడుతూ అప్పటి కరీంనగర్ నగరపాలక సంస్థ కమిషనర్ శశాంక్‌కు శిక్ష ఖరారు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *