Zoom App: కరోనా మహమ్మారి కారణంగా వర్చువల్వీడియో కాన్ఫరెన్సింగ్యాప్లకు బాగా డిమాండ్ పెరిగిపోయింది. ఓవైపు ఉద్యోగులకు వర్క్‌ఫ్రం హోమ్, మరోవైపు విద్యార్థులకు ఆన్‌లైన్ క్లాసులతో ఈ యాప్స్వాడటం తప్పనిసరిగా మారింది. దీంతో వర్చువల్ వీడియో కాన్ఫరెన్సింగ్యాప్ల మధ్య పోటీ కూడా భారీగా పెరిగింది. అందుకే ఈ యాప్స్కొత్త ఫీచర్లపై దృష్టిసారించాయి. పాపులర్వీడియో కాన్ఫరెన్సింగ్యాప్జూమ్తాజాగా ఓ కొత్త ఫీచర్‌ను ప్రకటించింది. జూమ్ కాల్స్ కోసం రియల్ టైమ్, మల్టీ-లాంగ్వేజ్ ట్రాన్స్‌క్రిప్షన్, ట్రాన్స్‌లేషన్ ఫీచర్‌ను త్వరలోనే జోడిస్తున్నట్లు వెల్లడించింది. వర్చువల్ సమావేశాలు మరింత సౌకర్యవంతంగా ఉండేందుకు ఈ ఫీచర్ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపింది.
విభిన్న ప్రాంతాలు, వేర్వేరు భాషలకు చెందిన ప్రజలు ఇబ్బంది లేకుండా మాట్లాడుకుందుకు ఈ ఫీచర్ ఉపయోగపడనుంది. వీడియో కాల్స్‌సమయంలో వేర్వేరు భాషలకు చెందిన వారు ఇబ్బంది లేకుండా సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకునేందుకు గాను ఈ కొత్త టెక్నాలజీ ఉపయోగపడుతుంది. ఎదుటి వ్యక్తి మాట్లాడుతుండగానే మనకు నచ్చిన భాషల్లోకి ట్రాన్స్‌లేట్ చేసుకునే సౌకర్యం ఉంటుంది. ఇందుకు గాను జర్మనీకి చెందిన కైట్స్అనే సంస్థను జూమ్కొనుగోలు చేసింది. కైట్స్‌కు సంస్థలకు సంబంధించిన టెక్నాలజీని ఉపయోగించుకొని వర్చువల్ మీటింగ్స్‌ను మరింత సులభతరం చేయనున్నామని జూమ్ చెబుతోంది.
ఈ లైవ్ ట్రాన్స్‌లేషన్ ఫీచర్ వచ్చే ఏడాది నుంచి అమల్లోకి రానుంది. ఈ ఫీచర్‌ద్వారా మొత్తం 12 భాషల్లో లైవ్ ట్రాన్స్లేషన్చేసుకోవచ్చు. అయితే ఏయే భాషలకు మద్దతిస్తుందనే విషయాన్ని మాత్రం ఇంకా క్లారిటీ లేదు. మనం చెప్పే విషయాలను టెక్స్ట్‌గా మర్చే ఫీచర్‌పై కూడా జూమ్పనిచేస్తుంది. దీని కోసం కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత అల్గారిథంలు, మెషిన్ లెర్నింగ్ (ML) టెక్నాలజీలను ఉపయోగించుకోనుంది.
కాగా, దీనిపై కంపెనీ తన బ్లాగ్ పోస్ట్‌లో పేర్కొంది. జూమ్ ఆటోమేటెడ్ ట్రాన్స్‌క్రిప్షన్‌ని 30 భాషలకు పొడిగించాలని, వచ్చే ఏడాదిలో 12 భాషలకు లైవ్ ట్రాన్స్‌లేషన్‌ను జోడించాలని ఆలోచిస్తున్నట్లు వెల్లడించింది. జూమ్‌లో వస్తున్న మరో అద్బుతమైన ఫీచర్ వైట్‌బోర్డ్ ఫీచర్. ఈ వైట్‌బోర్డ్ డిజిటల్ కాన్వాస్‌గా పనిచేస్తుంది. రిమోట్, ఆఫీసు ఉద్యోగులు వర్చువల్ వైట్‌బోర్డ్ ద్వారా ఇంటరాక్ట్ అవ్వడానికి ఇది అనుమతిస్తుంది. ఈ ఫీచర్ ఈ ఏడాది చివర్లో అందుబాటులోకి రానుంది.