వీడియో స్ట్రీమింగ్ ఫ్టాట్‌ఫాం యూట్యూబ్‌కు ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏ చిన్న సమాచారం కావాలన్నా వెంటనే యూట్యూబ్‌లో సెర్చ్ చేసే రోజులివీ. యూబ్యూట్ కూడా యూజర్ల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను పరిచయం చేస్తూ వస్తోంది. ముఖ్యంగా యూత్‌ను అట్రాక్ట్ చేసే క్రమంలో ఫార్ట్స్‌ను పరిచయం చేసింది. ఇదిలా ఉంటే తాజాగా మరో కొత్త ఫీచర్‌ను పరియం చేయనుంది యూట్యూబ్. తాజగా ఢిల్లీలో జరుగుతున్న గూగుల్ ఫర్ ఇండియా 2022 కార్యక్రమంలో ఈ కొత్త ఫీచర్‌కు సంబంధించిన వివరాలను వెల్లడించింది. సెర్చ్ ఇన్ వీడియో పేరుతో ఫీచర్‌ను తీసుకొస్తున్నారు.
ఈ ఫీచర్ సహాయంతో యూజర్లు వీడియోలో నచ్చిన అంశం గురించి సులువుగా వెతుకోవచ్చు. ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుందో వివరిస్తూ గూగుల్ ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఈ వీడియోలో ఆగ్రా పట్టణానికి సంబంధించి ఒక ఉదాహరణను ప్రస్తావించారు. వీడియో చూస్తున్న సమయంలో కింద సెర్చ్ బాక్స్ కనిపిస్తుంది. అందులో మీకు కావాల్సిన దానిని సెర్చ్ చేస్తే.. సదరు వీడియోలో మీరు సెర్చ్ చేసిన పార్ట్ ఎక్కడుందో వీడియో నేరుగా అక్కడి నుంచే ప్లే అవుతోందన్నమాట. ప్రస్తుతం టెస్టింగ్ స్టేజ్‌లో ఉన్న ఫీచర్‌ను త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నారు.
Do you struggle with skipping to the good part of the video? ?
▶ ──?── 19:19
We’re piloting the ability to search within videos on your phone’s Search app. Just type in your query using the ‘Search in video’ feature & find exactly what you’re looking for.#GoogleForIndia pic.twitter.com/G3KIhpO7ow— Google India (@GoogleIndia) December 19, 2022
ఇదిలా ఉంటే యూట్యూబ్ ఈ ఫీచర్‌తోపాటు యూట్యూబ్ మల్టీసెర్చ్ ఫీచర్‌ను కూడా తీసుకొస్తున్నట్లు తెలిపింది. ఈ ఫీచర్‌తో యూజర్లు సెర్చ్ ఇన్ వీడియో చేసేప్పుడు ఫొటో, స్క్రీన్‌షాట్ ద్వారా వెతకడంతోపాటు, సందేహాలకు సంబంధించిన ప్రశ్నలను తమకు నచ్చిన భాషలో తెలుసుకోవచ్చు. ఇవేకాకుండా బైలింగ్వల్ సెర్చ్ రిజల్ట్ అనే ఫీచర్‌ను కూడా పరిచయం చేయనుంది. ఈ ఫీచర్‌తో యూజర్ ఇంగ్లిష్‌లో అడిగిన ప్రశ్నకు తమకు నచ్చిన భాషలో సమాధానం పొందొచ్చు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..