AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

YouTube: యూబ్యూటర్లకు అదిరిపోయే న్యూస్‌.. ఆదాయం పెరిగేలా కొత్త ఫీచర్‌

ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ గుడ్ న్యూస్ చెప్పింది. క్రియేటర్ల ఆదాయం పెరిగేలా కొత్త ఫీచర్ ను తీసుకొచ్చారు. ఇంతకీ ఏంటా ఫీచర్.? యూట్యూబర్ల ఆదాయం పెంచేందుకు ఈ కొత్త ఫీచర్ ఎలా ఉపయోగపడనుంది.? లంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

YouTube: యూబ్యూటర్లకు అదిరిపోయే న్యూస్‌.. ఆదాయం పెరిగేలా కొత్త ఫీచర్‌
Youtube
Narender Vaitla
|

Updated on: Oct 25, 2024 | 3:44 PM

Share

ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌ యూట్యూబ్‌కు ఉన్న ఆదరణ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిందే. ప్రపంచవ్యాప్తంగా ఈ యాప్‌కు విపరీతమైన క్రేజ్‌ ఉంది. యూట్యూబ్‌ ద్వారా ఎంతో మంది తమ ట్యాలెంట్‌ను ప్రపంచాన్ని చాటుకుంటున్నారు. అంతేనా భారీగా ఆదాయం సైతం ఆర్జిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా క్రియేటర్ల కోసం కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది యూట్యూబ్.

క్రియేటర్లకు ఆదాయం పెంచడమే లక్ష్యంగా ఈ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చారు. షాపింగ్‌ అఫ్లియేట్ ప్రోగ్రామ్‌ పేరుతో యూట్యూబ్ కొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది. ఈ ఫీచర్ సహాయంతో ర్హులైన క్రియేటర్లు తన వీడియోల్లో ఉత్పత్తులను ట్యాగ్‌ చేసి ఆదాయాన్ని సంపాదించుకోవచ్చు. కాగా ఈ ఫీచర్‌ ఇప్పటికే దక్షిణ కొరియా, అమెరికా లాంటి దేశాల్లో అందేబాటులోకి రాగా.. ఈ సేవల్ని తాజాగా మరిన్న దేశాలకు విసర్తించేందుకు ప్రణాళికలు రచిస్తోంది.

ఇందులో భాగంగా యూట్యూట్ తాజాగా ఈ సేవలను భారత్లోనూ లాంచ్‌ చేసింది. ఇందుకోసం గాను మింత్రా, ఫ్లిప్‌కార్ట్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. అర్హులైన కంటెట్‌ క్రియేటర్లందరికీ ఈ సదుపాయం అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు యూట్యూబ్‌ తెలిపింది. ఈ ఫీచర్‌ను పొందాలంటే క్రియేటర్లు ముందుగా యూట్యూబ్‌ షాపింగ్‌లో సైనప్‌ అవ్వాల్సి ఉంటుంది.

మీ దరఖాస్తును యూట్యూబ్‌ అమోదం తెలిపిన తర్వాత ఈ సదుపాయాన్ని యాక్సెస్‌ చేసుకోవచ్చు. దీంతో యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేసే వీడియోలు, షార్ట్‌లు, లైవ్‌స్ట్రీమ్‌లో ఉత్పత్తులను ట్యాగ్‌ చేయొచ్చు. యూజర్లకు ఆ ఉత్పత్తులు నచ్చితే పక్కనే ఉన్న షాపింగ్‌ సింబల్‌పై క్లిక్‌ ఆ ప్రొడక్ట్‌ వివరాలు కనిపిస్తాయి. దీనికోసం వేరే బ్రౌజర్‌ పేజ్‌కు కూడా వెళ్లాల్సిన పనిలేదు. అక్కడే ఉత్పత్తి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చన్నమాట. అంతేకాదు నచ్చిన ప్రొడక్ట్‌ని అక్కడే పిన్‌ చేసుకునే అవకాశం కూడా కల్పించారు.

ఇలా యూట్యూబర్స్‌ ప్రమోట్‌ చేసిన ఉత్పత్తులను యూజర్లు కొనుగోలు చేస్తే క్రియేటర్లకు కమీషన్‌ లభిస్తుంది. ఒక వీడియోలో సుమారు 30 ప్రొడక్ట్స్‌ను ట్యాగ్ చేసుకోవచ్చు. ట్యాగ్ చేసే ముందే మీకు వచ్చే కమిషన్‌ వివరాలను తెలుసుకోవచ్చు. 10 వేల మంది కంటే ఎక్కువ సబ్‌స్క్రైబర్లు ఉన్న వారికి ఈ అవకాశం ఉంటుంది. చిన్నారుల కోసం నడుపుతోన్న ఛానల్స్‌, మ్యూజిక్‌ ఛానల్స్‌కు ఈ సదుపాయం అందుబాటులో ఉండదు. యూట్యూబ్‌ తీసుకొచ్చిన ఈ కొత్త ఫీచర్‌ సహాయంతో యూట్యూబర్ల ఆదాయం భారీగా పెరగడం ఖాయంగా కనిపిస్తోంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
మీ స్టవ్ తుడిచేటప్పుడు ఈ చిన్న చిట్కా పాటిస్తే..
మీ స్టవ్ తుడిచేటప్పుడు ఈ చిన్న చిట్కా పాటిస్తే..
ఆలుగడ్డలను ఫ్రిజ్‌లో పెడితే ఏమవుతుందో తెలుసా..? 99శాతం మంది..
ఆలుగడ్డలను ఫ్రిజ్‌లో పెడితే ఏమవుతుందో తెలుసా..? 99శాతం మంది..
తేనెటీగ కుట్టిందా?ఈ చిట్కాలతో నొప్పి, వాపును వెంటనే తగ్గించుకోండి
తేనెటీగ కుట్టిందా?ఈ చిట్కాలతో నొప్పి, వాపును వెంటనే తగ్గించుకోండి
ప్రపంచంలో ఎన్ని రకాల క్యాలెండర్లు ఉన్నాయో తెలుసా..?
ప్రపంచంలో ఎన్ని రకాల క్యాలెండర్లు ఉన్నాయో తెలుసా..?
ప్రభుత్వం నుంచి మరో గుడ్‌న్యూస్.. ఉచితంగా రూ.5లక్షల జీవిత బీమా!
ప్రభుత్వం నుంచి మరో గుడ్‌న్యూస్.. ఉచితంగా రూ.5లక్షల జీవిత బీమా!
ఇమ్యూనిటీని పెంచే ఉసిరికాయ, పచ్చిమిర్చి పప్పు.. ఎలా చెయ్యాలంటే
ఇమ్యూనిటీని పెంచే ఉసిరికాయ, పచ్చిమిర్చి పప్పు.. ఎలా చెయ్యాలంటే
హైదరాబాద్ వాసులకు మరో సూపర్ గుడ్ న్యూస్
హైదరాబాద్ వాసులకు మరో సూపర్ గుడ్ న్యూస్
సరిహద్దులు లేని ప్రేమ.. సిసిటివి కెమెరా వారధిగా పలకరిపులు
సరిహద్దులు లేని ప్రేమ.. సిసిటివి కెమెరా వారధిగా పలకరిపులు
ఆల్‌టైమ్‌ రికార్డ్‌.. దారుణంగా పడిపోయిన రూపాయి!
ఆల్‌టైమ్‌ రికార్డ్‌.. దారుణంగా పడిపోయిన రూపాయి!
రాష్ట్ర ప్రజలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. కొత్తగా 2లక్షల పెన్షన్లు
రాష్ట్ర ప్రజలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. కొత్తగా 2లక్షల పెన్షన్లు