షావోమీ వినియోగదారులకు గుడ్‌న్యూస్..! హైపర్‌‌ ఓఎస్‌4 అప్‌డేట్‌ స్పెషాలిటీస్‌ ఇవేనా

Xiaomi HyperOS 4.. ప్రముఖ షావోమీ మొబైల్ వినియోగదారులకు ఒక గుడ్ న్యూస్. ఈ కంపెనీ స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్ల కోసం త్వరలోనే ‘హైపర్‌ఓఎస్ 4’ అప్‌డేట్‌ను తీసుకురాబోతోంది. ఈసారి కేవలం పెర్ఫార్మెన్స్ మాత్రమే కాకుండా ఫోన్ చూడటానికి ఎంత అందంగా ఉండాలనే దానిపై కంపెనీ ఎక్కువ దృష్టి పెట్టింది. ఈ అప్‌డేట్ గురించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.

షావోమీ వినియోగదారులకు గుడ్‌న్యూస్..! హైపర్‌‌ ఓఎస్‌4 అప్‌డేట్‌ స్పెషాలిటీస్‌ ఇవేనా
Xiaomi Prepares Hyperos 4

Updated on: Aug 24, 2026 | 6:50 AM

స్మార్ట్‌ఫోన్ డిజైన్ విషయంలో షావోమి సంస్థ మరో విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుట్టింది. ఐఫోన్ డిజైన్‌ను పోలి ఉండే సరికొత్త ‘సాఫ్ట్‌లైట్ గ్లాస్’ యూఐతో హైపర్‌ఓఎస్ 4 అప్‌డేట్ రానుంది. కళ్లకు ఇంపుగా ఉండే ఈ కొత్త విజువల్ ఎఫెక్ట్స్, అర్హత గల డివైజ్‌ల వివరాలను తెలుసుకుందాం.

సాఫ్ట్‌లైట్ గ్లాస్ డిజైన్

ప్రముఖ షావోమీ మొబైల్ వినియోగదారులకు ఒక గుడ్ న్యూస్. ఈ కంపెనీ స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్ల కోసం త్వరలోనే ‘హైపర్‌ఓఎస్ 4’ అప్‌డేట్‌ను తీసుకురాబోతోంది. ఈసారి కేవలం పెర్ఫార్మెన్స్ మాత్రమే కాకుండా.. ఫోన్ చూడటానికి ఎంత అందంగా ఉండాలో అనే దానిపై కంపెనీ ఎక్కువ దృష్టి పెట్టింది. ముఖ్యంగా ఐఫోన్ డిజైన్‌ను పోలి ఉండే ఒక కొత్త ‘సాఫ్ట్ లైట్ గ్లాస్’ యూఐ (UI)తో ఈ అప్‌డేట్ రాబోతోంది.

ఈ కొత్త అప్‌డేట్‌లో ప్రధాన ఆకర్షణ సాఫ్ట్‌లైట్ గ్లాస్ ఎఫెక్ట్. ఫోన్ స్క్రీన్ వాడేటప్పుడు గాజులాంటి పారదర్శకత, అద్భుతమైన లైటింగ్ ఎఫెక్ట్స్, ఒక యాప్ నుంచి ఇంకో యాప్‌కి మారేటప్పుడు స్మూత్‌గా వచ్చే విజువల్స్ యూజర్లకు ఒక ప్రీమియం అనుభూతిని ఇస్తాయి. యాపిల్ లిక్విడ్ గ్లాస్ తరహాలోనే అనిపించినా, షాఓమి దీనిని తమ సొంత శైలిలో మరింత ఆకట్టుకునేలా తీర్చిదిద్దింది. ఈ డిజైన్ ఎఫెక్ట్స్ చాలా హెవీ గ్రాఫిక్స్‌తో కూడుకుని ఉంటాయి. అందుకే ఇవి రన్ అవ్వడానికి మంచి ప్రాసెసర్ అవసరం.

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్, డైమెన్సిటీ 9500 లేదా అంతకంటే అధునాతన ప్రాసెసర్లు ఉన్న ఫోన్లకు మాత్రమే ఈ ఫీచర్ మొదటగా అందుబాటులోకి వస్తుంది. అయితే పాత ప్రీమియం మోడల్స్ అయిన షావోమి 13, రెడ్‌మీ K70, షావోమి మిక్స్ ఫ్లిప్ వంటి ఫోన్లకు కూడా దీనిని అందించేందుకు కంపెనీ ఆలోచిస్తోంది.

సపోర్ట్ చేసే డివైజ్‌లు

చైనాలో ప్రస్తుతం హైపర్‌ఓఎస్ 4 బీటా టెస్టింగ్ జరుగుతోంది. ప్రాథమిక సమాచారం ప్రకారం షావోమి మిక్స్ ఫోల్డ్, మిక్స్ ఫ్లిప్ సిరీస్‌లతో పాటు షావోమి 17, 15, 14, 13 సిరీస్ ఫోన్లకు ఈ అప్‌డేట్ రానుంది. అలాగే రెడ్‌మీ K100, K90, K80, K70 సిరీస్ మోడల్స్, రెడ్‌మీ టర్బో సిరీస్ ఫోన్లు దీనిని సపోర్ట్ చేస్తాయి. వీటితో పాటు షావోమి ప్యాడ్ 8, ప్యాడ్ 7 సిరీస్, రెడ్‌మీ కె ప్యాడ్ ట్యాబ్లెట్లు కూడా ఈ జాబితాలో ఉన్నాయి.

ప్రస్తుతానికి ఈ ఫీచర్‌ను చైనాలోని బీటా యూజర్లతో పరీక్షిస్తున్నారు. ఇది సక్సెస్ అయ్యాక ఇతర దేశాల్లోని యూజర్లకు దీనిని విడుదల చేస్తారు. కాబట్టి గ్లోబల్ రోలౌట్ కోసం మరికొంత సమయం పట్టవచ్చు. చివరికి ఈ గ్లాస్ యుఐ కనుక పాత మోడల్స్‌కు కూడా వస్తే చాలామంది షావోమి యూజర్లకు తమ ఫోన్ సరికొత్తగా మారిన అనుభూతి ఖాయంగా దక్కుతుంది. ఈ కొత్త అప్‌డేట్ టెక్ మార్కెట్‌లో ఏ స్థాయిలో ఆదరణ పొందుతుందో వేచి చూడాలి.

Loading...
Unable to load recommendations.
Follow Us