Flying Race Car: ఆకాశంలో కార్ రేస్ చూస్తారా?  గాలిలో ఎగిరే రేసింగ్ కార్ ఇదిగో.. గంటకు 360 కి.మీ వేగం

| Edited By: Anil kumar poka

Feb 23, 2023 | 4:04 PM

అందుకు గానూ ప్రపంచంలోనే మొట్టమొదటి గాలిలో ఎగిరే రేస్ కార్ ను ఆస్ట్రేలియాలో ఆవిష్కరించారు. ఇది ఏకంగా గంటకు 360 కిలోమీటర్ల వేగంతో గాలిలో దూసుకుపోతుందని ఆ కారును తయారు చేసిన కంపెనీ ప్రకటించింది.

Flying Race Car: ఆకాశంలో కార్ రేస్ చూస్తారా?  గాలిలో ఎగిరే రేసింగ్ కార్ ఇదిగో.. గంటకు 360 కి.మీ వేగం
Airspeeder Mk4
Follow us on

ఫార్ములా వన్ కార్ రేసింగ్.. ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. ఇటీవల కాలంలో మన దేశంలో కూడా దీనిపై క్రేజ్ పెరుగుతోంది.. మన హైదరాబాద్ లోనే ఫార్ములా ఈ రేసింగ్ జరగడంలో అందరిలోనూ దీనిపై అవగాహన పెరిగింది. ఇది నిర్వహించాలంటే రేసింగ్ ట్రాక్ కావాలి. కొంత పరిధి వరకూ ఆ రేసింగ్ కు అవకాశం ఉంటుంది. అయితే ఇది ఇక గతం కానుంది. ఆకాశమే హద్దుగా మేఘాలలో కార్ రేసింగ్ త్వరలో జరిగే అవకాశం ఉంది. అందుకు గానూ ప్రపంచంలోనే మొట్టమొదటి గాలిలో ఎగిరే రేస్ కార్ ను ఆస్ట్రేలియాలో ఆవిష్కరించారు. ఇది ఏకంగా గంటకు 360 కిలోమీటర్ల వేగంతో గాలిలో దూసుకుపోతుందని ఆ కారును తయారు చేసిన కంపెనీ ప్రకటించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

ఫార్ములా వన్ కారుతో సమానంగా..

ఆస్ట్రేలియాలోని అడిలైడ్ లో ఉన్న అలౌడా ఏరోనాటిక్స్ అనే కంపెనీ ఎయిర్ స్పీడర్ ఎంకే4 ని ఆవిష్కరించింది. ఇది ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఫ్లయింగ్ కారుగా రికార్డులకెక్కింది.ఇది ఫార్ములా వన్ రేసింగ్ కార్లతో సమానమైన హ్యాండ్లింగ్ ను అందిస్తుందని ఆ కంపెనీ పేర్కొంది. ఇది నిట్ట నిలువుగా టేకాఫ్, ల్యాండింగ్ అవుతుంది. దీనిలో ఏఐ గింబాల్డ్ థ్రస్ట్ టెక్నాలజీతో వస్తోంది.

30 సెకన్లలోనే టాప్ స్పీడ్..

ఫ్లయింగ్ రేస్ కార్ ఎయిర్ స్పీడర్ ఎంకే4 హైడ్రోజన్ టర్భోజెనరేటర్ మోటర్ ఉంటుంది. 1,340 బీహెచ్పీ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 30 సెకన్లలోనే 360 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఏకధాటిగా 300 కిలోమీటర్లు ప్రయాణించగలుగుతుంది. దీనిని నడపడానికి పైలెట్ అవసరం. ఇది అధునాతన ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ సిస్టమ, అధునాతన ఏరోడైనమిక్స్ వస్తోంది. దాదాపు 950 కిలోల బరువుతో టేకాఫ్ కాగలుగుతుంది.

ఇవి కూడా చదవండి

రేస్ చూడొచ్చు..

అలౌడా ఏరోనాటిక్స్ సీఈఓ మాట్ పియర్సన్ మాట్లాడుతూ గాలిలో కార్ రేస్ నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. అందుకు గానూ తన ఎయిర్ స్పీడర్ ఎంకే4 ఫ్లయింగ్ రేస్ కార్ ను ఆవిష్కించామన్నారు. స్పాన్సర్లు, సాంకేతిక భాగస్వాములను ఆకర్షించామన్నారు. వచ్చే ఏడాది ఈ ఫ్లయింగ్ రేస్ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆసక్తి ఉన్న వారు పాల్గొనవచ్చని.. అందుకు తగిన ఎంట్రీలు ప్రారంభించినట్లు వివరించారు. ఇది మోటార్ స్పోర్ట్స్ చరిత్రలో ఓ కీలక ఘట్టమవుతుందని పేర్కొన్నారు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..