Moon exploration: చంద్రుడి దక్షిణ ధ్రువంపైనే ప్రపంచ దేశాల కన్ను.. విశ్వం రహస్యల గుట్టు విప్పుతుందని ఆశలు

|

Aug 04, 2021 | 4:01 PM

సమస్త విశ్వం ఆవిర్భావానికి మూలం సహా మరెన్నే జవాబులులేని ఖగోళ ప్రశ్నలకు సమాధానం కోసం ప్రపంచ దేశాలు చంద్రుడి దక్షిణ ధ్రువం వైపు ఆశగా చూస్తున్నాయి..

Moon exploration: చంద్రుడి దక్షిణ ధ్రువంపైనే ప్రపంచ దేశాల కన్ను.. విశ్వం రహస్యల గుట్టు విప్పుతుందని ఆశలు
Moon South Pole
Follow us on

సమస్త విశ్వం ఆవిర్భావానికి మూలం సహా మరెన్నే జవాబులులేని ఖగోళ ప్రశ్నలకు సమాధానం కోసం ప్రపంచ దేశాలు చంద్రుడి దక్షిణ ధ్రువం వైపు ఆశగా చూస్తన్నాయి. అంతరిక్ష పరిశోధనల్లో తమ సత్తా చాటాలని పలు దేశాలు ఎన్నో ఏళ్లుగా ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే ఇటీవల అంతరిక్ష పరిశోధనల్లో కొన్ని ప్రైవేటు సంస్థలు దూసుకొస్తుండడంతో తీవ్ర పోటీ నెలకొంది. ‘ఎవరు ముందు కనుగొంటారు.. ఎవరు ముందు చేరుకుంటారు’ అన్న స్థాయిలో ప్రైవేటు సంస్థలు పోటీ పడుతున్నాయి. ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్, జెఫ్ బెజోస్‌కు చెందిన బ్లూ ఆరిజిన్, రిచర్డ్ బ్రాడ్సన్‌కు చెందిన వర్జిన్ గెలాక్టిక్ సంస్థలు వాటి ప్రణాళికల ప్రయత్నాల్లో కొంత వరకు సఫలీకృతం అయ్యాయి.

ఎన్ని రహస్యాలు దాగి ఉన్నాయో..

ఇక చంద్రుడి దక్షిణ ధ్రువం విషయానికి వస్తే.. అపారమైన ఖనిజాలు, వనరులు పుష్కలంగా ఉన్న ఈ ప్రాంతంపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. ఈ ప్రాంతాన్ని క్షుణ్నంగా పరిశీలిస్తే సమస్త విశ్వానికి చెందిన రహస్యాలు ఛేదింవచ్చని ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి. చంద్రుడి దక్షిణ ధ్రువం ఉపరితలంపై చెల్లాచెదురుగా ఉన్న లోపలి భాగాలలో సమాధానం దొరకవచ్చని భావిస్తున్నారు. చంద్రుని ఉపరీతలంపై చక్కర్లు కొట్టిన అంతరిక్ష నౌక సహా చంద్రయాన్-1లోని మూన్ మినరాలజీ మ్యాటర్ అధ్యాయనాల పరిశీలన ద్వారా పరిశోధకులు ఒక నిర్ధారణకు వచ్చారు. దీని ద్వారా స్వౌర వ్యవస్థకు సంబంధించిన చరిత్ర, గ్రహాల ఆవిర్భావం రహస్యాల గుట్టు విప్పవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అక్కడి ఘనీభవించిన పొరల్లోని వనరులను భూమికి తీసుకురావడం ద్వారా భూమి, ఇతర గ్రహాల లోగుట్టును విప్పవచ్చని నాసా భావిస్తోంది. ఇలా విశ్వం రహస్యాలను ఛేదించేందుకు అందరి చూపు ఇప్పుడు చంద్రుడు దక్షిణ ధ్రువం వైపే.

Also read: Nazi: 100 ఏళ్ళ నాటి నాజీ క్యాంపు హత్యలపై ఇప్పుడు విచారణ…