Windows Security Update: విండోస్ ఓఎస్ వాడుతున్నారా.. అయితే వెంటనే మీ పీసీని అప్‌డేట్ చేసుకోండి.. లేదంటే జరిగే నష్టం ఇదే..!

|

Jul 08, 2021 | 2:46 PM

మీరు మైక్రోసాఫ్ట్ విండోస్ ఓఎస్ వాడుతున్నారా.. అయితే వెంటనే మీ సిస్టం అప్‌డేట్ చేసుకోవాలని సంస్థ పేర్కొంది. హానికరమైన ఓ లూప్ హోల్ వెలుగు చూసిన నేపథ్యంలో.. త్వరగా సిస్టం అప్‌డేట్ చేసుకోవాలని యూజర్లకు సూచించింది.

Windows Security Update: విండోస్ ఓఎస్ వాడుతున్నారా.. అయితే వెంటనే మీ పీసీని అప్‌డేట్ చేసుకోండి.. లేదంటే జరిగే నష్టం ఇదే..!
Windows Security Update
Follow us on

Windows Security Update: మీరు మైక్రోసాఫ్ట్ విండోస్ ఓఎస్ వాడుతున్నారా.. అయితే వెంటనే మీ సిస్టం అప్‌డేట్ చేసుకోవాలని సంస్థ పేర్కొంది. హానికరమైన ఓ లూప్ హోల్ వెలుగు చూసిన నేపథ్యంలో.. త్వరగా సిస్టం అప్‌డేట్ చేసుకోవాలని యూజర్లకు సూచించింది. ప్రింట్ నైట్‌మేర్ గా పిలిచే ఈ వైరస్.. విండోస్ ప్రింట్ స్ఫూలర్ సేవలను ప్రభావితం చేయనుందంట. ఈ మేరకు సైబర్ సెక్యూరిటీ సంస్థ సాంగ్‌ఫోర్ పరిశోధకులు దీనిని ఎలా ఎదుర్కోవాలో వివరించారు. ప్రింట్ స్ఫూలర్ లో హానికరమైన లూప్ హోల్ ను మేలో కనుగొన్నట్లు పరిశోధకులు ట్వీట్ చేశారు. దీంతో అనేక ముంది యూజర్లు ఒకేసారి ప్రింటర్‌ను ఉపయోగించేందుకు అనుమతిని ఇవ్వనుంది. దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో అనుకోకుండా విడుదలచేసి, అనంతరం డిలీట్ చేశారు. ఈమేరకు మైక్రోసాఫ్ట్ యూజర్లను హెచ్చరించింది. ఈ లూప్ ‌హోల్‌తో హ్యాకర్లు మన పర్మిషన్ లేకుండానే మన పీసీని తమ ఆధీనంలోకి తీసుకుంటారని, అలాగే డేటాను డిలీట్ చేయడం, కొత్త యూజర్లను క్రియోట్ చేసేందుకు పూర్తి అనుమతిని అందించనుందంట. దీంతో యూజర్ల సిస్టం, ల్యాప్‌టాప్‌లను హ్యాకర్లు తమ ఆధీనంలోకి తీసుకుంటారని హెచ్చించింది.

దీంతో మైక్రోసాఫ్ట్ అప్రమత్తమైంది. వెంటనే సెక్యూరిటీ అప్‌డేట్‌ను అందించింది. అయితే, ఇది కేవలం విండోస్ 10 కే పరిమితం కాదని, విండోస్ 7 యూజర్లు కూడా సెక్యూరిటీ అప్‌డేట్ చేసుకోవాలిని సూచించింది. కాగా, 12 ఏళ్ల క్రితం విడుదలైన విండోస్ 7కి గతేడాది నుంచి సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను ఆపేసింది. అయితే, ప్రస్తుతం వచ్చిన సమస్యతో పాత ఓఎస్‌కు కూడా అప్‌డేట్ అందించింది.

‘త్వరగా మీ సిస్టం అప్‌డేట్ చేసుకోవాలని’ మైక్రోసాఫ్ట్ యూజర్లకు సూచించింది. ప్రస్తుత అప్‌డేట్‌లో పాత వాటిని కూడా ఫిక్స్ చేసినట్లు కంపెనీ పేర్కొంది. మరోవైపు మైక్రోసాఫ్ట్ ఈ ఏడాది చివరి నాటికి విండోస్ 11 ను అందించనున్నట్లు తెలిపింది. ఈ మధ్యే నిర్వహించిన ఓ ఈవెంట్‌లో విండోస్ 11ను విడుదల చేసింది. విండోస్ 10 విడుదల అయ్యాక 6 ఏళ్ల తరువాత విండోస్ 11 ను కంపెనీ విడుదల చేయనుంది. ప్రస్తుతం 1.3 బిలియన్ డివైస్‌లలో విండోస్ 10 ఉన్నట్లు కంపెనీ పేర్కొంది.

Also Read:

OnePlus Nord 2: వన్‌ప్లస్‌ నుంచి మరో కొత్త మొబైల్‌.. లీకైన విడుదల తేదీ.. స్పెసిఫికేషన్లు..!

WhatsApp: వాట్సాప్‌లో మిమ్మల్ని ఎవరు బ్లాక్ చేశారో తెలుసుకోవాలా..? అయితే ఈ విధంగా చేయండి..!