WhatsApp: వాట్సప్‌లో మరో స్టన్నింగ్ ఫీచర్.. ఒక్కసారి ఇది చూస్తే వావ్ అనాల్సిందే..

వాట్సప్ మరో అదిరిపోయే ఫీచర్‌ను త్వరలో లాంచ్ చేస్తోంది. ఈ ఫీచర్ మెస్సేజ్‌లకు భద్రతను కల్పించనుంది. బ్యాంక్ ఓటీపీలు, పాస్ వర్డ్‌లు వంటి వాటికి రక్షణ కల్పించనుంది. మీ సమాచారం సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా ఈ ఫీచర్ ఉపయోగపడనుందని తెలుస్తోంది.

WhatsApp: వాట్సప్‌లో మరో స్టన్నింగ్ ఫీచర్.. ఒక్కసారి ఇది చూస్తే వావ్ అనాల్సిందే..
Whatsapp

Updated on: Mar 22, 2026 | 4:05 PM

వాట్సప్ ఇటీవల వరుస పెట్టి రకరకాల ఫీచర్లను జోడిస్తోంది. కస్టమర్లను ఆకర్షించేందుకు అనేక ఫీచర్లను తీసుకొస్తోంది. ఇందులో భాగంగా మరో అదిరిపోయే మెస్మరైజింగ్ ఫీచర్ ప్రవేశపెడుతోంది. వాట్సప్ త్వరలో కొత్త ప్రైవసీ ఫీచర్‌ను తీసుకురానుంది. ఈ ఫీచర్ మీ మెస్సేజ్‌లకు మరింత భద్రతను కల్పించనుంది. ఇక నుంచి మీరు మెస్సేజ్‌లు చదివిన వెంటనే డీలీట్ కానున్నాయి. మీరు ఎదుటివారి నుంచి మెస్సేజ్ వచ్చినప్పుడు మీరు చూడగానే 15 నిమిషాల్లో ఆటోమేటిక్‌గా డిలీట్ అవుతాయి. ఆప్టర్ రీడింగ్ పేరుతో వాట్సప్ ఈ ఫీచర్‌ను లాంచ్ చేస్తోంది. ఈ ఫీచర్ ఎందుకు తీసుకొస్తుంది..? దీని వల్ల ఉపయోగమేంటి? అనే వివరాలు తెలుసుకుందాం.

సున్నితమైన సమాచారం నుంచి రక్షణ

సైబర్ నేరాల నుంచి రక్షణ పొందేందుకు వాట్సప్ ప్రధానంగా ఈ ఫీచర్ ప్రారంభిస్తోంది. సున్నితమైన సమాచారాన్ని రక్షించేందుకు ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. ఓటీపీలు, బ్యాంక్ పాస్ వర్డ్స్ వంటి వ్యక్తిగత వివరాలను రక్షించడమే ఈ ఫీచర్ ఉద్దేశంగా చెప్పవచ్చు. మీరు బ్లూ టిక్ ఫీచర్‌ను డిసేబుల్ చేసినా కూడా ఈ ఫీచర్ పనిచేస్తుంది. ఓటీపీలు, ఇతర వ్యక్తిగత సమాచారాన్ని పంచుకునేవారికి ఇది యూజ్ అవుతుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్టింగ్ దశలో ఉండగా.. త్వరలో లాంచ్ చేసే అవకాశముందని తెలుస్తోంది. ప్రస్తుతం వాట్సప్ 24/7, 90 రోజుల డిసప్పియరింగ్ మెసేజ్ ఫీచర్లను అందిస్తోంది. అంటే మీరు టైమ్ సెట్ చేసుకుంటే ఈ టైమ్ తర్వాత మెస్సేజ్‌లు ఆటోమేటిక్‌గా అదృశ్యమవుతాయి.

కొత్త ఫీచర్ ఎలా వర్క్ చేస్తుంది..?

ఈ కొత్త ఫీచర్ ఎలా పనిచేస్తుందంటే.. మీరు మెస్సేజ్ చదివిన 15 నిమిషాల తర్వాత ఆటోమేటిక్‌గా కనిపించకుండా పోతుంది. ఒకవేళ మెస్సేజ్ మీరు చదవకపోతే 24 గంటల పాటు అలాగే ఉండి ఆ తర్వాత అదృశ్యమవుతుంది. మీరు మెస్సేజ్ ఎప్పుడు ఓపెన్ చేశారనేది సిస్టమ్ ట్రాక్ చేస్తుంది. వినియోగదారుడి గోపత్యను ఇది కాపాడుతుందని, సున్నితమైన సమాచారం నుంచి రక్షణ పొందవచ్చని వాట్సప్ చెబుతోంది. ఇది ప్రస్తుతం వాట్సప్ బీటా వెర్షన్‌లో కనిపించగా.. అభివృద్ది దశలో ఉంది. రానున్న కొద్ది నెలల్లో ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది. బ్యాంక్ సమాచారం అక్రమార్కుల చేతికి దొరకడం వల్ల మోసాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా సైబర్ మోసాలు నానాటికి పెరుగుతున్నాయి. దీంతో సమాచారం వేరేవారికి అందకుండా ఉండేందుకు వాట్సప్ ఈ ఫీచర్ తీసుకొస్తుంది.

Follow Us