WhatsApp: వాట్సాప్ మెసేజింగ్ యాప్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఉపయోగిస్తున్న యాప్‌గా వాట్సాప్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను (Features) తీసుకొస్తూ వినియోగదారులను ఆకర్షిస్తుంది కాబట్టే ఈ యాప్‌కు ఇంత క్రేజ్ ఉంది. ఇక పోటీగా ఎన్నో మెసేజింగ్ యాప్స్ వచ్చినా వాట్సాప్ తన స్థానాన్ని మాత్రం సుస్థిరం చేసుకుంటోంది. ఈ క్రమంలోనే తాజాగా మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చే పనిలో పడింది వాట్సాప్.
వాట్సాప్‌లో 100 ఎంబీ కంటే ఎక్కువ సైజ్ ఉన్న ఫైల్‌ను షేర్ చేసుకోలేమని విషయం తెలిసిందే. అయితే వాట్సాప్ పోటీగా వచ్చిన కొన్ని యాప్స్‌లో ఏకంగా 1.5 జీబీని షేర్ చేసుకునే అవకాశం ఉంది. దీంతో కొందరు యూజర్లను వాట్సాప్‌కు ప్రత్యామ్నాయంగా ఇతర యాప్‌లను ఉపయోగిస్తున్నారు. దీంతో అలర్ట్ అయిన వాట్సాప్ కొత్త ఫీచర్‌ను తీసుకు వచ్చేందుకు ప్రణాళికలు రచిస్తోంది. త్వరలోనే 2 జీబీ వరకు ఉండే ఫైల్‌ను షేర్ చేసుకునే అవకాశం కల్పించనుంది. ఇందులో భాగంగానే కొత్త ఫీచర్‌ను తీసుకురానుంది.
వాట్సాప్ బీటా ఇన్ఫో నివేదిక ప్రకారం.. ప్రస్తుతం ఈ ఫీచర్‌ను అర్జెంటీనాలోని బీటా యూజర్లకు పరీక్షిస్తోంది. అనంతరం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అందరు యూజర్లకు అందుబాటులోకి తీసుకురానుంది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు ఈ ఫీచర్‌ను అందించనున్నారు. ఇదిలా ఉంటే మొదట్లో వాట్సాప్ కేవలం 16 ఎంబీ సైజ్ ఫైల్స్‌ను మాత్రమే షేర్ చేసుకునే అవకాశం ఉండేది. అనంతరం యూజర్ల అభ్యర్థన మేరకు దీనిని 100 ఎంబీకి చేరింది. తాజాగా దీనిని 2 జీబీకి పెంచేందుకు సిద్ధమవుతోంది.
Andhra Pradesh News: రాళ్లు, కర్రలతో యువకుల హల్చల్.. శ్రీకాకుళం జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత..