వాట్సాప్.. మోస్ట్ పాపులర్ మెసేజింగ్ యాప్ అన్న విషయం తెలిసిందే. పాపులర్ మాత్రమే కాదు చాలా స్పెషల్ కూడా. ఎప్పటికప్పుడు వినూత్న ఫీచర్స్‌తో యూజర్లను ఆకట్టుకుంటుంది వాట్సాప్. ఈ క్రేజీ యాప్ లెటెస్ట్‌గా మరిన్ని అప్‌డేట్స్‌తో మనముందుకొచ్చింది. న్యూ ఐకాన్స్, మ్యూట్ బటన్, కేటలాగ్ షార్ట్‌కట్, గంపెడన్నీ ఎమోజీలు.. ఇలా యూజర్ ఫ్రెండ్లీ ఫీచర్లను అప్‌డేటెడ్ వెర్షన్‌లో అందిస్తుంది. వీటిలో కొన్ని పరిమిత యూజర్లకే అందిస్తుండగా, మిగిలినివి నార్మల్ యూజర్లకూ అందిస్తోంది. ఆ సరికొత్త ఫీచర్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆల్వేస్ మ్యూట్ బటన్ :
ఈ సమస్య అందరికీ ఉండేదే. మనకు కనీస సమాచారం ఇవ్వకుండానే వాట్సాప్ గ్రూప్స్‌లో యాడ్ చేస్తుంటారు కొందరు. తెలిసిన వాళ్లు అవ్వడం వల్ల ఏమనుకుంటారో అని గ్రూప్ నుంచి లెఫ్ట్ అవ్వలేం. అలాంటప్పుడే మ్యూట్ ఆప్షన్ ఎంపిక చేసుకుని నోటిఫికేషన్ల తలనొప్పి లేకుండా చూసుకుంటాం. ఈ మ్యూట్ బటన్‌లో ఇప్పటి వరకు 8 గంటలు, వారం, సంవ్సతరం ఆప్షన్లుండేవి. ఇప్పుడు ‘ఫరెవర్’ అనే కొత్త ఆప్షన్‌ను ఇంట్రడ్యూస్ చేశారు. ఈ ఆప్షన్‌ను ఎంచుకుంటే ఇంకెప్పుడూ ఆ గ్రూప్ నోటిఫికేషన్లు రావు.
కొత్తగా 138 ఎమోజీలు..
ఇప్పుడు ఎక్కువగా మనం ఎమోజీలతోనే మాట్లాడుకుంటున్నాం. సింపుల్ అండ్ షార్ట్ కట్ పద్దతిలో మన మనసులోని భావాలు వ్యక్తపరుస్తున్నాం. అందుకే ఏకంగా 138 ఎమోజీలతో వాట్సాప్ మన ముందుకొచ్చింది. రైతు, చెఫ్, పెయింటర్ వంటి ఎమోజీలతోపాటు మరిన్ని అట్రాక్టివ్ ఆబ్జెక్ట్స్‌ను ఇంట్రడ్యూస్ చేస్తోంది వాట్సాప్.
కేటలాగ్ షార్ట్‌కట్
స్పెషల్ గా బిజినెస్ వాట్సాప్ వినియోగదారుల కోసం ఈ కేటలాగ్ షార్ట్‌కట్ ఫీచర్‌ను ప్రవేశపెట్టారు. హోం మెనూలో ఉండే ఆడియో, వీడియో కాల్స్ ఐకాన్స్‌ను కలిపేసి దాని పక్కనే కొత్తగా కేటలాగ్ ఐకాన్ షార్ట్‌కట్‌ను తీసుకొచ్చారు. ఐఓఎస్, ఆండ్రాయిడ్, వెబ్ వాట్సాప్, డెస్క్‌టాప్ యాప్‌లకు ఈ ఫీచర్‌ను అందుబాటులో ఉంచారు.
న్యూ అటాచ్‌మెంట్ ఐకాన్స్
వాట్సాప్‌లో చాట్ చేస్తున్నప్పుడు మనం ఫొటోలు, వీడియోలు, ఆడియోలు సెండ్ చేస్తూ ఉంటాం. అటాచ్‌మెంట్ ఆప్షన్‌పై క్లిక్ చేసి పంపాల్సిన ఫైల్స్‌ను సెలక్ట్ చేసి సెండ్ చేస్తాం. ఈ అటాచ్‌మెంట్ ఐకాన్‌లో ఇప్పటి వరకు కెమెరా, గ్యాలరీ, ఆడియో, లొకేషన్, డాక్యుమెంట్, కాంటాక్స్ ఆప్షన్స్ ఉండగా.. ఇప్పుడు అదనంగా ‘పేమెంట్’, ‘రూమ్’లను ప్రవేశపెట్టారు. ఈ పేమెంట్ ఆప్షన్‌పై క్లిక్ చేసి యూపీఐ ద్వారా డబ్బు పంపుకోవచ్చు. ‘రూమ్’ ఆప్షన్ ద్వారా నేరుగా ఫేస్‌బుక్ మెసెంజర్ వీడియో కాన్ఫరెన్సింగ్ ఫీచర్‌ను అనేబుల్ చేసుకోవచ్చు.
వీడియోలు, ఫొటోలు ఇంకాస్త కొత్తగా..
ఫొటోలు, జిఫ్ చిత్రాలను పంపే సమయంలోనే ఎడిట్ చేసుకునే ఆప్షన్‌తో ‘మీడియా గైడ్‌లైన్స్’ అనే ఫీచర్‌ను వాట్సాప్ ప్రవేశపెట్టింది. ఇకపై మనం పంపించే వీడియోలు, ఫొటోలపై స్టిక్కర్లు యాడ్ చేసుకోవచ్చు. టెక్ట్స్ రాసుకోవచ్చు.
Also Read :