Whats App: వాట్సాప్‌లో షాకింగ్ అప్‌డేట్.. ప్రత్యేక జాబితాతో ఆ సమస్య ఫసక్..!

ఇటీవల యువత ఎక్కువగా స్మార్ట్ ఫోన్స్ వినియోగిస్తున్నారు. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్‌లో ఉండే వాట్సాప్‌కు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. వాట్సాప్ లేని స్మార్ట్ ఫోన్ లేదంటే అతిశయోక్తి కాదు. ఇంత ప్రజాదరణ పొందిన వాట్సాప్ తన సేవలను రోజురోజుకూ విస్తరిస్తుంది. తాజాగా యూజర్లను ఆకర్షించేందుకు కొత్తకొత్త అప్‌డేట్స్‌ను తీసుకువచ్చింది. వాట్సాప్ తీసుకొచ్చిన అప్‌డేట్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

Whats App: వాట్సాప్‌లో షాకింగ్ అప్‌డేట్.. ప్రత్యేక జాబితాతో ఆ సమస్య ఫసక్..!
Whatsapp

Updated on: Jun 15, 2025 | 5:30 PM

వినియోగదారులు అనువైన అన్ని ఫీచర్లను విడుదల చేసేందుకు వాట్సాప్ అడుగులు వేస్తుంది. వాటిలో కొన్ని ఇంకా అభివృద్ధి దశలోనే ఉన్నప్పటికీ లక్షలాది మందికి ఉపయోగపడే ఫీచర్లపై ప్లాట్‌ఫామ్ దృష్టి సారిస్తుంది. తాజాగా వాట్సాప్ డ్రాఫ్ట్ జాబితా అనే కొత్త ఫీచర్‌తో యూజర్ల ముందుకు వచ్చింది. ఈ ఫీచర్‌ ద్వారా మీరు చదవని మెసేజ్‌లు, గ్రూప్‌లలో వచ్చే మెసేజ్‌లు, అలాగే ఇష్టమైన చాట్‌లను ఒక బటన్‌తో వేరు చేసే సదుపాయం ఉంటుంది. వాట్సాప్ చాలా మంది మెసేజ్ టైప్ చేయడం ప్రారంభించి పంపడం మర్చిపోతే ఈ డ్రాఫ్ట్ ఫోల్డర్ సిస్టమ్‌ ద్వారా ఏ చాట్ వద్ద డ్రాఫ్ట్ చేసిన మెసేజ్ ఉందో కనుగొనడం చాలా సులభం అవుతుంది. 

వాట్సాప్ బీటా ఇన్‌ఫో తాజాగా ఒక పోస్ట్‌లో హైలైట్ చేసినట్లుగా ఈ ఫీచర్ ప్రస్తుతం బీటా అప్‌డేట్ వినియోగదారుల కోసం చాట్ ఫీడ్‌కు ప్రీసెట్ డ్రాఫ్ట్ జాబితా జోడించారని పేర్కొంది. రాబోయే రోజుల్లో ఈ ఫీచర్ అందరికీ అందుబాటులోకి వస్తుందని పేర్కొంది.  ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చిన వాట్సాప్ యాప్ ఫీడ్ పైభాగంలో అన్నీ, ఇష్టమైనవి పక్కన కొత్త డ్రాఫ్ట్ ట్యాబ్‌ను కలిగి ఉంటుంది. మీరు డ్రాఫ్ట్‌లపై నొక్కినప్పుడు దిగువ స్క్రీన్‌లో మీరు పంపని అన్ని చాట్‌లు కనిపిస్తాయి. మీరు జాబితా నుంచి ట్యాబ్‌ను కూడా సవరించవచ్చు. అలాగే మీ ఎంపిక ప్రకారం విభిన్న ఎంపికల మధ్య మారవచ్చు.  డ్రాఫ్ట్ ఫిల్టర్ ప్రీసెట్ ఆప్షన్‌గా ఉంటుందని, మీరు దానిని మీ వాట్సాప్ ఖాతా కోసం మాన్యువల్‌గా కాన్ఫిగర్ చేయాల్సిన అవసరం లేదని లేదా సెటప్ చేయాల్సిన అవసరం లేుద. 

వాట్సాప్ ప్లాట్‌ఫామ్ ద్వారా సంబంధిత అప్‌డేట్ విడుదలైన తర్వాత ఇది స్వయంచాలకంగా కనిపిస్తుంది. ఈ ఫీచర్ ఇంకా అభివృద్ధి దశలోనే ఉంది. అనంతరం వాట్సాప్ దానిని పబ్లిక్‌గా తీసుకోవాలా లేదా ప్రస్తుతానికి జంక్ చేయాలా అనే దానిపై నిర్ణయం తీసుకుంటుంది. ప్రజలు మెటా ఏఐ చాట్‌బాట్‌ను ఉపయోగించుకునేలా చేయడానికి వాట్సాప్ కూడా కొత్త మార్గాలను ప్రయత్నిస్తోంది. జెమిని, గ్రోక్ లాగా మీరు మెటా ఏఐతో ఫొటోలు లేదా ఫైల్స్‌ను షేర్ చేయవచ్చు. అలాగే సంబంధిత సమాధానాలను పొందవచ్చు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి