ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌కు ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పా్ల్సిన పనిలేదు. ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది యూజర్లతో ఈ యాప్ దూసుకుపోతోంది. స్మార్ట్‌ఫోన్ ఉపయోగించే ప్రతీ ఒక్కరు వాట్సాప్‌ను ఉపయోగిస్తారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. యూజర్ ఫ్రెండ్లీగా ఉండడం, యూజర్ల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్స్‌ను తీసుకొస్తోంది. మరీ ముఖ్యంగా యూజర్ల ప్రైవసీకి పెద్ద పీట వేయడంతో ఈ యాప్‌ను ఉపయోగిస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మార్కెట్లోకి ఎన్ని రకాల కొత్త మెసేజింగ్ యాప్స్ అందుబాటులోకి వచ్చినా వాట్సాప్‌కు ఉన్న క్రేజ్ తగ్గకపోవడానికి ప్రధాన కారణం ఇదేనని చెప్పొచ్చు.
ఇటీవల వరుసగా ప్రైవసీ ఫీచర్లను పరిచయం చేస్తున్న వాట్సాప్ తాజాగా మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్‌ను తీసుకొచ్చింది. వాట్సాప్ చాట్ లాక్ పేరుతో ఈ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చారు. ఇంతకీ ఈ ఫీచర్ ఏంటి.? దీని ఉపయోగం ఏంటి.? లాంటి వివరాలు తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే. సాధారణంగా వాట్సాప్‌లో వ్యక్తిగత చాట్స్ అందరికీ ఉంటాయి. ఫ్రెండ్స్‌తోనే, ఫ్యామిలీ మెంబర్స్‌తోనే వ్యక్తిగతంగా చేసే చాట్స్ ఉంటాయి. అయితే పొరపాటున లేదా ఉద్దేశపూర్వకంగానో పక్కనవారికి ఫోన్ ఇస్తే మన చాట్ వాళ్లు చూసే అవకాశం ఉంటుంది. అయితే ఈ సమస్యకు చెక్ పెట్టడానికే వాట్సాప్ చాట్ లాక్ పేరుతో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఈ ఫీచర్ సహాయంతో మీరు కోరుకున్న చాట్ లేదా వాట్సాప్ గ్రూప్‌లను ఎవరికీ కనిపించకుండా చేయొచ్చు. ఇంతకీ ఈ ఫీచర్‌ను ఎలా యాక్టివేట్ చేసుకోవాలంటే..
ఇందుకోసం ముందుగా మీ వాట్సాప్‌ను లేటెస్ట్ వెర్షన్‌కి అప్‌డేట్ చేసుకోవాలి. అనంతరం మీ ఫోన్‌లో వాట్సాప్ యాప్‌ను ఓపెన్ చేయాలి. తర్వాత మీరు లాక్ చేయాలనుకుంటున్న చాట్‌ను ఓపెన్ చేసి, ప్రొఫైల్‌పై క్లిక్ చేయాలి. తర్వాత కిందికి స్క్రోల్ చేస్తే ‘చాట్ లాక్’ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిని క్లిక్ చేసి ‘లాక్ దిస్ చాట్ విత్ ఫింగర్ ప్రింట్’ అనే ఆప్షన్‌ను ఎనేబుల్ చేసుకోవాలి. దీంతో ఒకపై ఆ చాట్ మెయిన్ చాట్ బాక్స్‌లో ఎవరికీ కనిపించదు. మరి మళ్లీ ఆ చాట్‌ను ఎలా ఓపెన్ చేసుకోవాలనేగా.. ఇందుకోసం వాట్సాప్‌ను ఓపెన్ చేసి.. కిందికి స్క్రోల్ చేయాలి, ఇలా చేస్తే లాక్‌డ్ చాట్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి థంబ్ నెయిల్‌తో అన్‌లాక్ చేసుకుంటే సరి మీరు హైడ్ చేసిన చాట్ ఓపెన్ అవుతుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..