Whatsapp: “గుడ్ మార్నింగ్” మెసేజ్ లు ఎక్కువగా పంపిస్తుంటారా.. అయితే మీ పని అయిపోయినట్లే.. పూర్తి వివరాలివే..

|

Oct 18, 2022 | 11:15 AM

ఉదయం నిద్ర లేచింది మొదలు.. రాత్రి నిద్రపోయేంత వరకు వాట్సాప్ చూడందే పొద్దు గడవదు. ఇక అందులో పంపించే గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్ నూన్, గుడ్ ఈవ్ నింగ్, గుడ్ నైట్ మెసేజ్ లకు కొదవే లేదు. ఎంతగా అంటే..

Whatsapp: గుడ్ మార్నింగ్ మెసేజ్ లు ఎక్కువగా పంపిస్తుంటారా.. అయితే మీ పని అయిపోయినట్లే.. పూర్తి వివరాలివే..
Whatsapp
Follow us on

ఉదయం నిద్ర లేచింది మొదలు.. రాత్రి నిద్రపోయేంత వరకు వాట్సాప్ చూడందే పొద్దు గడవదు. ఇక అందులో పంపించే గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్ నూన్, గుడ్ ఈవ్ నింగ్, గుడ్ నైట్ మెసేజ్ లకు కొదవే లేదు. ఎంతగా అంటే ఆ ఫొటోలు, వీడియోలతో మన గ్యాలరీ నిండిపోయేంత. ఫైనల్ గా మనం పడే ఇబ్బందులు ఎన్నెన్నో. మనకు తెలిసిన వారు, పరిచయం ఉన్న వారే ఇలాంటి మెసేజ్ లు పంపిస్తుండటంతో ఏమీ అనలేని పరిస్థితి. వారంతట వారే తెలుసుకుంటారనుకుంటే.. విషెస్ మాత్రమే కదా చెప్పేది అని వారు ఫీల్ అవుతుంటారు. దీంతో తప్పక భరించాల్సిన సిచ్యువేషన్. అయితే.. ఇకపై అలాంటి ఇబ్బందులకు చెక్ పడనుంది. ఎందుకంటే.. ఎక్కువగా గుడ్ మార్నింగ్ మెసేజ్ లు పంపించిన వారి ఎకౌంట్ ను బ్లాక్ చేసేందుకు వాట్సాప్ రెడీ అయింది. అంతే కాకుండా దీన్ని స్పామ్‌గా గుర్తిస్తూ కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. అంతే కాకుండా ప్రతి నెలా మిలియన్ల సంఖ్యలో భారతీయ ఖాతాలను నిషేధించడానికి ఇది ఒక కారణమైంది. ఎందుకంటే ప్రపంచంలో ఏ దేశం పంపించనన్నీ గుడ్ మార్నింగ్ మెసేజ్ లు మనమే పంపిస్తున్నాం మరి..

అంతే కాకుండా ఫేక్ సమాచారాన్ని ఫార్వార్డ్ చేయడాన్ని వాట్సాప్ తీవ్రంగా పరగిణిస్తోంది. యూజర్ సేఫ్టీ రిపోర్ట్ ప్రకారం ఆగస్టు నెలలోనే 2.3 మిలియన్లకు పైగా భారతీయ అకౌంట్ లు క్యా్న్సిల్ అయ్యాయి. మెసేజ్ ల క్వాంటిటీ ఎక్కువగా ఉన్నందున కంపెనీ సేవా రూల్స్ ను ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకోనున్నారు. మెసేజ్‌లను ఫార్వార్డ్ చేసే ముందు చెక్ చేసి, రీచెక్ చేయమని వాట్సాప్ కోరుతుంది. మెసేజ్ ఎక్కడి నుంచి వచ్చిందో మీకు తెలియకపోతే దానిని ఫార్వార్డ్ చేయకపోవడమే మంచిది. ఆటోమేటెడ్ లేదా బల్క్ మెసేజ్‌లు, ఆటో-డయల్‌లను నివారించాలని సూచించింది. కొత్త కాంటాక్ట్‌లను గ్రూప్‌లో యాడ్ చేసే ముందు వారి నుంచి అనుమతి తీసుకోవాలి. మీరు ఎవరినైనా గ్రూప్ లో యాడ్ చేస్తే అది కొన్ని సార్లు వారికి నచ్చకపోవచ్చు. కాబట్టి వారు గ్రూప్ నుంచి ఎగ్జిట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి వారి నిర్ణయాన్ని గౌరవించి, ఇబ్బంది పెట్టకుండా వ్యవహరించాలని వాట్సాప్ వినియోగదారులకు రిక్వెస్ట్ చేస్తోంది.

ఇవి కూడా చదవండి

చట్టవిరుద్ధమైన, పరువు నష్టం కలిగించే, భయపెట్టే, వేధించే ప్రవర్తనతో కూడిన మెసేజ్ లను పంపించడం మానుకోవాలి. ఎందుకంటే ఇలా చేయడం వాట్సాప్ సేవా నిబంధనలను ఉల్లంఘించడం కిందికి వస్తోంది. ఒకసారి అకౌంట్ బ్లాక్ అయిన తర్వాత.. దానిని తిరిగి వినియోగంలోకి తీసుకువచ్చేందుకు కొన్ని నిబంధనలు పాటించాలి. వాట్సాప్‌కు ఈ – మెయిల్ పంపించాలి. మీరు పంపించిన అభ్యర్థనను వాట్సాప్ పరిశీలిస్తుంది. అనంతరం మీ దగ్గరి నుంచి రివ్యూ కోరుతుంది. రివ్యూను పూర్తి చేసిన తర్వాత ఎస్ఎమ్ఎస్ ద్వారా 6-అంకెల రిజిస్ట్రేషన్ కోడ్‌ వస్తుంది. దానిని ఎంటర్ చేస్తే తిరిగి వాట్సాప్ ను ఉపయోగించవచ్చు. అయితే కొన్ని సందర్భాల్లో ఇంకా కొన్ని వివరాలు అడిగే అవకాశం ఉంది.