WhatsApp Groups: వాట్సాప్.. ఇది ప్రతి ఒక్కరి స్మార్ట్‌ఫోన్ (Smartphone)లో ఉండాల్సిందే. ఇది లేనిది స్మార్ట్‌ఫోన్ అంటూ ఏదీ ఉండదు. ఉదయం లేచింది నుంచి రాత్రి పడుకోబోయే వరకు ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్ చాటింగ్ (whatsapp chating), గ్రూప్ చాటింగ్ (Group Chating), స్టేటస్‌లతో మునిగి తేలుతుంటారు. ఇక యూజర్లను దృష్టిలో ఉంచుకుని వాట్సాప్ (Whatsapp) సంస్థ కూడా అనేక ఫీచర్స్‌ను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఇక వాట్సాప్ (WhatsApp)లో గ్రూపులు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా కొందరిని చేరుస్తూ గ్రూప్‌ను క్రియేట్ చేసుకుంటూ తమ తమ సందేశాలను పంచుకుంటున్నారు. ఇక వాట్సాప్ గ్రూప్ (WhatsApp Groups) లో సభ్యులు ఎవరైనా మెసేజ్ (Messages)లు చేస్తే దానిని తొలగించాలంటే పంపిన వారు తప్ప ఇంకెవ్వరు కూడా తొలగించే అనుమతి ఉండదు. దానిని డిలీట్ (Delete) చేయాలంటూ పంపిన వారికి రిక్వెస్ట్ పెట్టాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ (Group Admins)ల కొరకు అదిరిపోయే ఫీచర్స్‌ను తీసుకువచ్చింది వాట్సాప్.
గ్రూపులో అడ్మిన్‌లుగా ఉన్న వారు గ్రూప్‌లో ఏ సందేశాన్నైనా తొలగించవచ్చు. వాట్సాప్ గ్రూపు నిర్వహిస్తున్న వారికి ఈ ఫీచర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎందుకంటే గ్రూపుల్లో రకరకాల మెసేజ్‌లు పెడుతుంటారు. కానీ కొన్ని పనికి రాని మెసేజ్‌లు వస్తే వాటిని తొలగించాలంటూ పంపిన వారు మాత్రమే డిలీట్ చేయాల్సి ఉండేది. ఇప్పుడు డిలీట్ చేసే అనుమతి గ్రూప్ అడ్మిన్‌లకు కూడా ఉంటుంది. ఏదైనా మెసేజ్‌ను అత్యవసరంగా డిలీట్ చేయాల్సి వస్తే ఇప్పుడు గ్రూప్ అడ్మిన్ చేయవచ్చు.
వాట్సాప్ ఫీచర్ ట్రాకర్ WABetaInfo ప్రకారం.. వాట్సాప్ గ్రూప్‌లోని సదరు యూజర్ షేర్ చేసిన సందేశాలను తొలగించడానికి గ్రూప్ అడ్మిన్‌లను అనుమతించే ఫీచర్‌పై వాట్సాప్ పని చేస్తోంది. అయితే, ఇలాంటి ఫీచర్ ఇప్పటికే టెలిగ్రాం యాప్‌లో అందుబాటులో ఉండగా.. వాట్సాప్ కూడా దానిపై పనిచేస్తున్నట్టు నివేదికలు చెబుతున్నాయి. WABetaInfo ప్రకారం… ఈ ఫీచర్ ఆండ్రాయిడ్, ఐవోఎస్ బీటా వెర్షన్‌లలో వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. వాట్సాప్ ఫీచర్ ట్రాకర్ షేర్ చేసిన స్క్రీన్ షాట్ ప్రకారం.. వాట్సాప్ గ్రూపులలో యూజర్లు పంపిన మెసేజ్‌లను అడ్మిన్స్ డిలీట్ చేసే ఫీచర్‌ను అందులో చూడవచ్చు. యూజర్ పంపిన మెసేజ్‌ను గ్రూప్ అడ్మిన్స్ డిలీట్ చేశారనే విషయాన్ని గ్రూప్‌లోని ఇతర సభ్యులందరికీ తెలుస్తుంది. కొత్తగా తీసుకువచ్చే ఈ ఫీచర్‌తో అడ్మిన్స్‌కు భారీ ఊరట కలిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గ్రూపుల్లో వివాదాలకు దారి తీసే సందేశాలు, ఇతర కంటెంట్‌లను అరికట్టడానికి గ్రూప్ అడ్మిన్లకు ఇది ఉపయోగపడనుంది.
ఇవి కూడా చదవండి: