Whatsapp: యూజర్లకు షాకిచ్చిన వాట్సాప్‌.. భారత్‌లో 23.87 లక్షల అకౌంట్లు బ్యాన్‌.. కారణమేంటంటే..

|

Sep 03, 2022 | 7:35 AM

Whatsapp: యూజర్ల భద్రతకు పెద్ద పీట వేస్తూ ప్రముఖ మెసేజింగ్ యాప్‌ వాట్సాప్‌ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఇప్పటికే పలు రకాల సెక్యూరిటీ ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం...

Whatsapp: యూజర్లకు షాకిచ్చిన వాట్సాప్‌.. భారత్‌లో 23.87 లక్షల అకౌంట్లు బ్యాన్‌.. కారణమేంటంటే..
Whatsapp Account Banned
Follow us on

Whatsapp: యూజర్ల భద్రతకు పెద్ద పీట వేస్తూ ప్రముఖ మెసేజింగ్ యాప్‌ వాట్సాప్‌ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఇప్పటికే పలు రకాల సెక్యూరిటీ ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే కేవలం యూజర్ల భద్రతతో పాటు ఫేక్‌ న్యూస్‌ వ్యాప్తికి కూడా అడ్డుకట్ట వేసే దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే వివాదాస్పద అకౌంట్లపై కొరడా ఝులిపిస్తోంది. ఇందులో భాగంగానే ఒక్క జూలై నెలలోనే భారత్‌లో ఏంగా 23.87 లక్షలకుపైగా వాట్సాప్‌ ఖాతాలను నిషేధించింది. సదరు వాట్సాప్‌ అకౌంట్స్‌పై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఈ చర్య తీసుకున్నట్లు వాట్సాప్‌ తెలిపింది. ఇక జూన్‌ 22 లక్షలు, మేలో 19 లక్షల ఖాతాలను వాట్సాప్‌ బ్యాన్‌ చేసింది.

పలు మార్గదర్శకాలు, నిబంధనలను ఉల్లంఘించిన కారణంగా ఖాతాలను నిషేధించినట్లు వాట్సాప్‌ తెలిపింది. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ రూల్స్‌-2021 నిబంధనల ప్రకారమే ఈ చర్యలు తీసుకున్నారు. యూజర్ల ఫిర్యాదులు దానిపై తాము తీసుకున్న చర్యల వివరాలు కూడా పొందుపరిచామని వాట్సాప్ తెలిపింది. ఇక జూలై నెలలో అందిన 574 ఫిర్యాదుల్లో 392 నివేదికలు ‘బ్యాన్‌ అప్పీల్‌’ (ఖాతాను నేషేధించమని) కాగా, మిగితావి అకౌంట్‌, ప్రొడక్ట్స్‌ సెక్యూరిటీ లాంటివి వచ్చాయని వాట్సాప్‌ తెలిపింది. జూలై 1 నుంచి 31వ తేదీ వరకు మొత్తం 23,87,000 ఖాతాలను నిషేధించామని వాట్సాప్‌ తెలిపింది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..