Whatsapp: వాట్సప్ యూజర్లకు అదరిపోయే న్యూస్.. ఇకపై సైలెంట్‌గా బయటపడొచ్చు.. ఇంకా ఫుల్ ప్రైవసీ

ఫ్రెండ్స్ గ్రూప్, ఆఫీస్ గ్రూస్, పొలిటికల్ గ్రూప్, ఇంకా ఎన్నో గ్రూప్స్‌లలో విషయాలను పంచుకుంటుంటారు. అయితే.. వాట్సప్ గ్రూపుల్లో అసౌకర్యం కలిగించే విషయం ఏంటంటే.. అవసరం, ఇష్టం లేకపోయినా కొన్నిసార్లు గ్రూపులో కొనసాగాల్సి ఉంటుంది.

Whatsapp: వాట్సప్ యూజర్లకు అదరిపోయే న్యూస్.. ఇకపై సైలెంట్‌గా బయటపడొచ్చు.. ఇంకా ఫుల్ ప్రైవసీ
Whatsapp
Follow us

|

Updated on: Aug 10, 2022 | 12:11 PM

Exit WhatsApp groups silently: వాట్సప్.. వాట్సప్.. వాట్సప్.. ఉదయం లేచిన దగ్గర్నుంచి మొదలు రాత్రి పడుకునే వరకు.. అర్ధరాత్రులు కూడా ప్రతిఒక్కరు చూస్తారు. ఎవరు ఏం చేస్తున్నారు.. ఎక్కడ ఉన్నారు.. వారి స్టేటస్ ఏంటి..? అలా ఎందుకు పెట్టారు.. ఇక ఎన్నో చర్చలు. ఇవన్నీ ఒకటైతే.. గ్రూపుల్లో మరో సందడి.. ఫ్రెండ్స్ గ్రూప్, ఆఫీస్ గ్రూస్, పొలిటికల్ గ్రూప్, ఇంకా ఎన్నో గ్రూప్స్‌లలో విషయాలను పంచుకుంటుంటారు. అయితే.. వాట్సప్ గ్రూపుల్లో అసౌకర్యం కలిగించే విషయం ఏంటంటే.. అవసరం, ఇష్టం లేకపోయినా కొన్నిసార్లు గ్రూపులో కొనసాగాల్సి ఉంటుంది. ఏవేవో చెత్త ఫొటోలు, వీడియోలు, మెస్సెజ్‌లు చిరాకుపుట్టిస్తుంటాయి. ఒకవేళ ఎగ్జిట్ అయితే.. అందరికీ తెలిసిపోతుంది. ఇంకా, మనం చేసే చాట్‌లను కూడా స్క్రీన్ షాట్ తీసుకునే సదుపాయం ఉంది. దీనివల్ల గోప్యత అంతగా ఉండదు. అలాంటి వాటన్నింటికి చెక్ పెట్టేందుకు వాట్సప్ మరో కొత్త ఫీచర్‌ను తీసుకువస్తోంది. ఇక ఏదైనా గ్రూపులో కొనసాగడం ఇష్టం లేకపోతే.. సైలెంట్ గా ఎవరికీ తెలియకుండా బయటపడొచ్చు. అవును.. మీరు విన్నది నిజమే.. ఇకపై గ్రూపుల్లో కొనసాగడం ఇష్టం లేకపోతే ఎగ్జిట్ కావొచ్చంటూ వాట్సప్ యూజర్లకు అదిరిపోయే న్యూస్ పంచుకుంది. యూజర్ల ప్రైవసీకి అధిక ప్రాధాన్యత ఇస్తూ వస్తోన్న వాట్సాప్‌.. తాజాగా మరో కొత్త ఫీచర్‌ గురించి మంగళవారం ప్రకటించింది.

వాట్సప్ యూజర్లు.. గ్రూపులోంచి ఎవ్వరికీ తెలియకుండా నిశ్శబ్దంగా ఎగ్జిట్ కావొచ్చు. అలాగే వారు ఆన్‌లైన్‌లో ఉన్నప్పుడు ఎవరు చూడవచ్చు.. ఎవరు చూడకూడదో ఎంచుకోవచ్చు. వ్యూ వన్స్‌ మెసేజెస్‌ను స్క్రీన్‌షాట్‌లను తీయకుండా WhatsApp లో నివారించవచ్చు. వాట్సప్‌లో అలా బ్లాక్‌ చేసే సదుపాయాన్ని త్వరలోనే అందుబాటులోకి తేనున్నట్లు మెటా వ్యవస్థాపకుడు, సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌ ప్కటించారు. ప్రస్తుతం దీనికి సంబంధించి ప్రయోగాత్మక పరిశీలన జరుగుతుందని త్వరలోనే అందుబాటులోకి వస్తుందని తెలిపారు. గ్రూప్ నుంచి ఎగ్జిట్ అవ్వడం, వ్యూ వన్స్‌ మెసేజెస్‌లను స్క్రీన్‌షాట్‌ తీయకుండా నిరోధించే సదుపాయం వల్ల ఇద్దరి మధ్య జరిగిన చాట్‌కు అదనపు భద్రత కల్పించినట్లు అవుతుందని జుకర్‌ బర్గ్‌ వివరించారు. సందేశాలను రక్షించడానికి కొత్త మార్గాలను రూపొందిస్తూనే ఉంటామని Meta వ్యవస్థాపకుడు, CEO మార్క్ జుకర్‌బర్గ్ తెలిపారు. కాగా.. ఈ ఫీచర్ ఈ నెలలోనే వినియోగదారులందరికీ అందుబాటులోకి రానుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..