YouTube: యూట్యూబ్‌లో యాడ్‌లతో విసుగెత్తిపోతున్నారా? ఈ ట్రిక్‌‌తో యాడ్‌ స్కిప్! ఓ సారి ట్రై చేయండి..

|

May 20, 2023 | 4:45 PM

మీరు సీరియస్‌గా ఏదో వీడియో చూస్తు‍న్నప్పుడు అకస్మాత్తుగా ఓ యాడ్‌ ప్లే అవుతూ ఉంటుంది. ఆ సమయంలో అది చాలా చిరాకును, కోపాన్ని కూడా తెప్పిస్తుంది. 30 సెకండ్ల యాడ్‌లో 15 సెకండ్లు యాడ్‌ ప్లే అవుతుంది. మిగిలిన 15 సెకండ్లను స్కిప్‌ చేయొచ్చు.

YouTube: యూట్యూబ్‌లో యాడ్‌లతో విసుగెత్తిపోతున్నారా? ఈ ట్రిక్‌‌తో యాడ్‌ స్కిప్! ఓ సారి ట్రై చేయండి..
Youtube On Smart Tv
Follow us on

ప్రస్తుతం యూట్యూబ్‌ తెలియని వారు లేరంటే అతిశయోక్తి కాదేమో! చదువుకున్న వ్యక్తుల దగ్గర నుంచి విద్యార్థులు, గృహిణుల వరకూ అందరూ యూట్యూబ్‌కు అలవాటైపోయారు. అయితే మీరు సీరియస్‌గా ఏదో వీడియో చూస్తు‍న్నప్పుడు అకస్మాత్తుగా ఓ యాడ్‌ ప్లే అవుతూ ఉంటుంది. ఆ సమయంలో అది చాలా చిరాకును, కోపాన్ని కూడా తెప్పిస్తుంది. 30 సెకండ్ల యాడ్‌లో 15 సెకండ్లు యాడ్‌ ప్లే అవుతుంది. మిగిలిన 15 సెకండ్లను స్కిప్‌ చేయొచ్చు. ఇప్పుడు గూగుల్‌ మరో కీలక ప్రకటన చేసింది. అదేంటంటే అతి పెద్ద యాడ్లను స్మార్ట్‌ టీవీ యూట్యూబ్‌ యాప్‌లలో ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించింది. చిన్న చిన్న యాడ్లే చిరాకురా బాబు అంటుంటే 15 సెకండ్లు, 30 సెకండ్లకు పైగా యాడ్‌ ప్లే అయితేనే అదెంత విసుగ్గా ఉంటుందో కదా. మరి అంతకు మించిన టైం యాడ్‌ ప్లే అయితే అది చాల కష్టం కదా? మరి అలాంటి సమయంలో ఏం చేయాలి? యూ ట్యూబ్‌లో యాడ్‌ రాకుండా చూడాలంటే ఎలా? వివరాలు తెలుసుకోండి..

యాడ్‌ స్కిప్‌ చేయాలంటే..

ప్రస్తుతం యూట్యూబ్‌లో యాడ్‌ స్కిప్‌ చేయాలంటే ఒకే ఒక అవకాశం ఉంది. అదేంటంటే యూ ట్యూబ్‌ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను కొనుగోలు చేయడమే. అవునండి అదొక్కటే సొల్యూషన్‌. అయితే అంత ఎక్కువ కూడా దీని కోసం పే చేయాల్సిన అవసరం లేదు. తక్కువ మొత్తంలోనే మీకు ఈ యూట్యూబ్‌ మెంబర్‌ షిప్‌ వస్తుంది. యూట్యూబ్‌ ప్రీమియం మెంబర్‌షిప్‌ యూఎస్‌లో 11.9 డాలర్లు కాగా మన దేశంలో నెలకు రూ. 129గా ఉంది.

ఎందుకు కొనుగోలు చేయాలి..

యూ ట్యూబ్‌లో ఎటువంటి యాడ్‌లు లేకుండా మీరు వీడియోలు చూడాలంటే ఈ సబ్‌స్క్రిప్షన్‌ తీసుకోవాల్సిందే. ఒకసారి మెంబర్‌షిప తీసుకుంటే ఏ డివైజ్‌ నుంచైనా మీరు యాడ్‌ ఫ్రీ కంటెంట్‌ ను ఆస్వాదించవచ్చు. స్మార్ట్‌ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ టీవీలు దేనిలో అయినా యాడ్‌ లేకుండా చూడొచ్చు.

ఇవి కూడా చదవండి

యూట్యూబ్‌ మెంబర్‌షిప్‌ తీసుకుంటే యూట్యూబ్‌ మ్యూజిక్‌ యాప్‌ ను ఉచితంగా యాక్సెస్‌ చేయవచ్చు. దీనికోస అదనంగా ఏమి చెల్లించాల్సిన అవసరం లేదు. దీని వల్ల ఇతర మ్యూజిక్‌ యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసే అవసరం ఇక ఉండదు.

అలాగే ఈ మెంబర్‌ షిప్‌ పీఐపీ ఫీచర్‌ను సపోర్టు చేస్తుంది. దీంతో మీరు వేరే యాప్‌ లో పనిచేస్తూనే వీడియో ఆగకుండా చూడొచ్చు. ఇది ప్రీమియం మెంబర్స్‌కు మాత్రమే అందుబాటులో ఉంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..